Home Latest News Rakhi Video : బిచ్చగాడికి రాఖీ కట్టింది.. ఫోన్ కానుకగా పొందింది.. – Andhra Waves

Rakhi Video : బిచ్చగాడికి రాఖీ కట్టింది.. ఫోన్ కానుకగా పొందింది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


రాఖీ వీడియో : సోషల్ మీడియా విశ్వవ్యాప్తమైన తర్వాత చాలామందికి పిచ్చెక్కింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు. చివరికి తాము మనుషులము అనే విషయం కూడా మర్చిపోతున్నారు. నేల విడిచి సమ్మన్నట్టుగా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి పిచ్చివాడి వేషం వేశాడు. చూసేందుకు చాలా భయంకరంగా ఉన్నాడు. అటువైపుగా కొంతమంది అమ్మాయిలు పాఠశాల నుంచి బయటికి వస్తున్నారు. ఎ […]

రాఖీ వీడియో : సోషల్ మీడియా విశ్వవ్యాప్తమైన తర్వాత చాలామందికి పిచ్చెక్కింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు. చివరికి తాము మనుషులము అనే విషయం కూడా మర్చిపోతున్నారు. నేల విడిచి సమ్మన్నట్టుగా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి పిచ్చివాడి వేషం వేశాడు. చూసేందుకు చాలా భయంకరంగా ఉన్నాడు. అటువైపుగా కొంతమంది అమ్మాయిలు పాఠశాల నుంచి బయటికి వస్తున్నారు. ఆ పిల్లలకి ఎదురుగా ఈ పిచ్చి వేషం వేసిన వ్యక్తి ఎదురుగా వెళ్ళాడు. దాంతో ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది అయితే భయపడుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. చూసేందుకు ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. అసలు ఆ సమయంలో ఆ పిచ్చివాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్న అందరిలో వ్యక్తం అయింది.

ఆ పిచ్చి వాడిని చూస్తున్న చాలా మంది పిల్లలు భయపడ్డారు. అందులో ఒక అమ్మాయి మాత్రం ధైర్యం తెచ్చుకొని అతడికి రాఖీ కట్టింది. ఆ తర్వాత ఈ వీడియోకు శుభం కార్డు పడింది. అయితే ఇది కూడా ఒక ఫ్రాంక్ వీడియో. రాఖీ పౌర్ణమి రోజు కొందరు కావాలని రూపొందించిన వీడియో. స్క్రిప్ట్ బాగుంది.. నటించిన వ్యక్తి బాగున్నాడు. ఆ అమ్మాయి కూడా నాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఇంతవరకు బాగానే కనిపించే రాఖీ పౌర్ణమి రోజు ఈ పనికిమాలిన వీడియోలు చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హైలెట్ అవ్వాలంటే మంచి పనులు చేయాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలాకాకుండా ఇలాంటి వెకిలి వేషాలు వేయటం ఏంటి. చివరికి పండగ పూట కూడా దాని సంస్కృతిని కించపరిచే విధంగా వీడియోలు రూపొందించడం ఏంటి.. రోజు రోజుకు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఇటువంటి చిల్లర పనులు కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అదే ఈ వీడియో ఇప్పటికే 10 లక్షల వ్యూస్ నమోదు చేయడం విశేషం. పిచ్చివాడి రూపంలో ఉన్న ఆ బిచ్చగాడికి రాఖీ కట్టిన యువతికి చివర్లో ఫోన్ ఇచ్చారు. అది కూడా బహుమతిగా ఇవ్వడం విశేషం. దీన్నిబట్టి దీనిని ఒక పోటీగా రూపొందించి.. ఆ యువతికి ఫోన్ బహుమతిగా ఇచ్చారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird