Home జాతీయం పంజాబ్: సమర శంఖం సరే.. పదివేల మంది పోలీసులు సరిపోతారా.. – Andhra Waves

పంజాబ్: సమర శంఖం సరే.. పదివేల మంది పోలీసులు సరిపోతారా.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



పంజాబ్: అది ఈనాటి సమస్య కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఏటికేడు తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. యువశక్తి నిర్వీర్యం అవుతోంది. అలవాటు పడినవారు తమ శక్తిని యుక్తిని దానికోసమే ఖర్చు పెడుతున్నారు. ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఆ మత్తులో చాలామంది నేరాలకు గురవుతున్నారు. వాటిని తీసుకొని.. మత్తులో నేరాలకు గురవుతున్న వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయింది. అటువంటి వ్యక్తుల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మత్తు పదార్థాలు విక్రయించే వారి పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించబోతోంది. ఏకంగా 10,000 మంది పోలీసులను రిక్రూట్ చేసుకోబోతోంది.

మనదేశంలో పాకిస్తాన్ దేశానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ ఒకటి. పంజాబ్ ప్రాంతంలో మత్తు పదార్థాలు విపరీతంగా లభిస్తాయి. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో మత్తు పదార్థాల తయారీ.. మత్తు పదార్థాల తయారీకి అవసరమయ్యే పంటల సాగు జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈసారి అక్కడి భగవంతు సింగ్ మాన్ ప్రభుత్వం మత్తు మీద కఠిన వైఖరి అవలంబించబోతోంది. నిజానికి భగవంతుడు ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మత్తు పదార్థాలు.. వాటిని విక్రయించే ముఠాలకు ప్రభుత్వం సహకారం అందించిందని అభియోగాలు ఉన్నాయి. వాస్తవానికి పంజాబ్ రాష్ట్రంలో మత్తు పదార్థాలను తొక్కి పెట్టడానికి.. ఆ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా మార్చడానికి 10,000 మంది కాదు. అంతకుమించిన పోలీసులు అవసరం. ప్రస్తుత ప్రభుత్వం మొదటినుంచి ఇదే ధోరణిని ప్రదర్శిస్తే పంబాజ్‌లో మత్తు పదార్థాల రవాణా, వినియోగం దాదాపుగా తగ్గేవి.

పంజాబ్లో మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు చివరికి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడులకు వెనుకంజ వేశారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారిని గతంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు.. పోలీస్ స్టేషన్ల మీద మత్తు పదార్థాలకు బానిసలు అయిన వ్యక్తులు దాడులు చేశారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను హతమార్చారు కూడా. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటం.. పైగా మత్తు పదార్థాల వినియోగం రాష్ట్రంలో విపరీతంగా ఉండటంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా నిద్రలేచింది. వాస్తవానికి ఉడ్తా పంజాబ్ లాంటి సినిమా ద్వారా పంజాబ్‌లో పరిస్థితిని వివరించారంటే అక్కడ ఏ స్థాయిలో మత్తు పదార్థాల వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్తు పదార్థాల రవాణా.. తయారీ.. సరఫరా వంటి నెట్‌వర్క్‌లను ఎదుర్కోవాలంటే పోలీసు సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అక్రమ మార్గాలు.. మత్తు పదార్థాల సరఫరా.. వంటి వాటి మీద నిరంతరం నిఘా పెట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే 10,000 మంది పోలీసులు ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి సరిపోతారా.. అంతకుమించిన విభాగాలు అవసరమవుతున్నాయా.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ గనుక పంజాబ్ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యవస్థను ప్రభుత్వం అడుగుదాక తొక్కి వేస్తే.. పంజాబ్ రాష్ట్రంలో అది నవ శకం లాగా మిగిలిపోతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird