Home జాతీయం నానా పటేకర్ : ప్రముఖ దిగ్గజ నటుడి కన్నుమూత.. సినీ పరిశ్రమలో – Andhra Waves

నానా పటేకర్ : ప్రముఖ దిగ్గజ నటుడి కన్నుమూత.. సినీ పరిశ్రమలో – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


నానా పటేకర్ : భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లమున గోవాలోని తన నివాసంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటలకు ఆయన ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

నానా పటేకర్ మృతితో బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలోనూ విషాదం. ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ ఆ సమయంలో పుణేలో ఉండగా, తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే గోవాకు బయలుదేరినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

‘గమన్’తో మొదలైన సినీ ప్రయాణం

1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్ 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తన విభిన్నమైన నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీ, సహజమైన నటనా శైలితో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. సాధారణమైన, బలహీనమైన, భావోద్వేగాలతో పాత్రలను కూడా అద్భుతంగా పోషించడం ఆయన ప్రత్యేకత.

‘పరిందా’, ‘వజూద్’, ‘యశ్వంత్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘అపహరణ’, ‘రాజ్‌నీతి’, ‘టాక్సీ నంబర్ 9211’ వంటి సినిమాల్లో ఆయన నటనకు విశేష ప్రశంసలు లభించాయి. 2007లో వచ్చిన ‘వెల్‌కమ్’ సినిమాలో ‘ఉదయ్ శెట్టి’ పాత్రలో ఆయన చేసిన కామెడీ నటనకు విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాత్రను ‘వెల్కమ్ బ్యాక్’లోనూ కొనసాగించారు.

అవార్డులతో ప్రత్యేక గుర్తింపు

నానా పటేకర్ తన సినీ ప్రస్థానంలో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. 2016లో మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’లో అద్భుతమైన నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

నటనతో పాటు నానా పటేకర్ గాయకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘యశ్వంత్’, ‘వజూద్’, ‘ఆంచ్’ వంటి చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేశారు.

నాలుగు రోజుల క్రితమే బహిరంగ కార్యక్రమంలో..

నానా పటేకర్ మరణానికి కేవలం నాలుగు రోజుల ముందు గోవాలోని డోనా పౌలాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్స్టాలేషన్ హాజరై ప్రసంగించారు. అదే ఆయన చివరి బహిరంగ ప్రదర్శనగా నిలిచింది.

సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నానా పటేకర్ పనిచేస్తుంది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయడంలో ఆయన ముందుండేవారు.

‘హౌస్‌ఫుల్ 5’లో చివరిసారి..

ఇటీవల విడుదలైన కామెడీ థ్రిల్లర్ ‘హౌస్‌ఫుల్ 5’లోనూ నానా పటేకర్ కీలక పాత్రలో కనిపించారు. దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఆకస్మిక మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది.

తీవ్రమైన భావోద్వేగాలను కళ్లతోనే పలికించగల నటుడిగా, శక్తివంతమైన సంభాషణలను తనదైన శైలిలో పలికించే కళాకారుడిగా నానా పటేకర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు, పలికించిన సంభాషణలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird