ఎందుకో తెలియదు గాని జాన్వీ కపూర్(జాన్వీ కపూర్)తన స్నేహితుడు శిఖర్ పహారియాతో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే న్యూస్ గత కొన్ని రోజుల నుంచి చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది. కొంత ముందైతే తమకి పెళ్లి ఇన్విటేషన్ వచ్చిన వాళ్లల్లా ఆ ఇద్దరి వివాహం తిరుపతిలో జరగబోతుందనే వార్తలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ తండ్రి బోనీకపూర్ చెప్పిన మాటలతో వాళ్ళు జాన్వీ పెళ్లి భోజనం తినాలని ఆశపడే వాళ్ళకి టైం పట్టేలా ఉంది.
బోనీ కపూర్ కపూర్ మాట్లాడుతు జాన్వీ పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. జాన్వీ తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి ఇచ్చింది. పెళ్లి గురించి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి రూమర్స్ సృషించ వాళ్ళకి ‘బాగా చెప్పాడు కదా, అర్థమైందా, సరిపోయిందా అనే డైలాగ్స్ తో కూడిన మీమ్స్ ఎదురవుతున్నాయి.
ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST
బోనీ కపూర్(Boney kapoor)చెప్పినట్టుగానే జాన్వీ పెద్ది(పెద్ది)తో నిల్వ ఉంది. దేవర తో అదరగొట్టిన జాన్వీ పెద్ది తో తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్థానంలో కూర్చోవాలని ఆశపడుతోంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మగా పెద్దిని తన అందంతో, చేష్టలతో మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉంది. దీంతో ఆటోమెటిక్ గా ప్రేక్షకులు తన అధీనంలో ఉండటం పక్కా. తన కోరిక నెరవేరడం పక్కా . పెద్ది జూన్ 4న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 7వ తేదీ ఓవర్ సీస్ బుకింగ్ స్టార్ట్ కానున్నాయి.
