మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టీబీఎం యంత్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టన్నెల్‌లో జరుగుతున్న బెంచింగ్, లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో మంత్రి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు.
నాలుగు గ్యాంట్రీల వద్ద జరుగుతున్న పనులు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతం చేయడానికి ఇంజినీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.రాత్రంతా టన్నెల్‌లోనే ఉండి పనులను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి, 24 గంటల క్లాక్‌వైజ్ విధానంలో పనులు కొనసాగాలని సూచించారు.
టన్నెల్‌లో అక్కడ పనిచేస్తున్న గ్యాంట్రీలు, కార్మికులు, యంత్రాల మధ్య సమన్వయం పెంచి పనులు త్వరగా పూర్తయ్యాయి.సుమారు 19 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్‌లో క్లిష్టమైన, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మంత్రి స్వయంగా రాత్రివేళల్లో ఉండి ప్రోత్సాహం అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు, ఉన్నారు.
.webp)
