దేవభూమి కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్)కి ఉన్న క్రేజ్. ఇప్పుడు అందరు సోషల్ మీడియా బిడ్డలు కాబట్టి అల్లు అర్జున్ పట్ల కేరళ అభిమానుల తాలూకు అభిమాన స్థాయిని చూస్తూనే ఉన్నాం. ఆ అభిమానాన్ని చూసి బడా హీరోలతో పాటు యావత్తు మలయాళ చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోతోంది.
రీసెంట్ గా కేరళ క్యాపిటల్ త్రివేంద్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని మరింత బలపరచడం, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేరళలోని అన్ని ఏరియాల నుంచి జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు. జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్ కి సౌత్ ఇండియా నుంచి భారీ ఎత్తున ఫ్యాన్స్ పాల్గొనబోతున్నారు.
ఇది కూడా చదవండి: వారణాసి: వారణాసి@199 రూపాయలు
ఇప్పుడు జూన్ 4 న మీటింగ్ అనే న్యూస్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కాబోతుంది.

