లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (సింగీతం శ్రీనివాసరావు) మ్యాజిక్ మళ్ళీ వెండితెరపై పునరావృతం కాబోతోంది. ఆయన దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింగ్ గీతం’ (సింగ్ గీతం). #SSR61 అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్ అధికారిక టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ప్రశంసలు అందిస్తోంది. సుమారు 40 ఏళ్లుగా ఈ కథ చెప్పడం కోసం తాను వేచి చూస్తున్నానని సింగీతం చెప్పిన మాటలు, ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
టీజర్ ప్రారంభం నుండి చివరి వరకు ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ వైబ్‌ను కలిగి ఉంది. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు విజన్ ఎంత యంగ్‌గా ఉందో ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కుబేరపురం అనే గ్రామం నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మైనింగ్, ఫారెన్ డీల్ అంటూ ఊరి మనుషుల మధ్య సరదా సన్నివేశాలతో ట్రైలర్ నడిచింది. ఓ వైపు ఊరంతా హడావుడి, బ్యాక్ గ్రౌండ్ లో “ఏమైంది బాబో ఏదో అయిపొయింది” అనే సాంగ్ తో.. కథలో ఏదో జరగబోతుందని తెలిపేలా ఆసక్తికరంగా ట్రైలర్ ను కట్ చేశారు.
ఈ సినిమాల కంటే పాటలకు పెద్ద పీట వేస్తున్నట్లు. రాక్ దేవి శ్రీ ప్రసాద్స్టా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుంది. టీజర్లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఉంది. సింగీతం మేకింగ్ స్టైల్‌కు తగ్గట్లుగా దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు ఆత్మలా నిలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. సింగీతం పట్ల ఆయనకున్న గౌరవం ప్రతి ఫ్రేమ్‌లోనూ ఉంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఒక క్లాసిక్ స్టోరీని నేటి తరం టెక్నాలజీతో మిక్స్ చేసి ఎలా ప్రెజెంట్ చేయాలో నాగ్ అశ్విన్ టీమ్ మరోసారి నిరూపించింది.
‘సింగ్ గీతం’ మూవీ జూన్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా విడుదలైన టీజర్ స్వచ్ఛమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. వేసవి ముగింపులో ఒక చల్లని మెలోడీ లాంటి సినిమా రాబోతోందని అర్థమవుతోంది.
