అల్లుడిదాడిలో అత్త మృతి చెందిన సంఘటన మేడ్చెల్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కల్లా కావ్య, స్నేహిత్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీ కారంతో ఏడాది క్రితం వీరికి వివాహం జరిగింది. వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఆరోజు రాత్రి సమయంలో స్నేహిత్ పలుమార్లు అత్త అరుణకు ఫోన్ చేసి కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అత్త అరుణ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29 మధ్యాహ్నం అత్త అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతున్న సమయంలో… అక్కడికి వచ్చిన అల్లుడు స్నేహిత్ అత్త అరుణతో గొడవపడడమే కాకుండా బలవం తంగా ఆమెను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత స్నేహిత్ తన భార్య కావ్యకు ఫోన్ చేసి అత్త అరుణకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుండి కింద పడిందని తెలిపాడు. దీనితో అరుణను మొదటగా సమీపంలోని మెడి స్టార్ హాస్పిటల్ కి ఉంది. అనంతరం మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్ ఆర్బీఎం హాస్పిటల్ కి. అయితే ఈ ఘటనపై కావ్యకు అనుమానం వచ్చి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. భర్త స్నేహిత్ బైక్‌పై వెళ్తున్న సమయంలో తన తల్లి అరుణతో వాగ్వివాదానికి దిగాడు. అనంతరం స్నేహిత్ వెనుక కూర్చున్న అత్త అరుణ తలపై హెల్మెట్తో గట్టిగా బాదాడు. దీంతో రన్నింగ్ లో ఉన్న బైక్ పై నుండి అత్త అరుణ రోడ్డుపై పడిపోయినట్లుగా సీపీ ఫుటేజీలో స్పష్టంగా ఉంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 సాయంత్రం సమయంలో మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్ పై కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు వచ్చారు.
.webp)