-శరవేగంగా ముస్తాబవుతున్న రాక
-అల్లు అర్జున్ గెటప్ పై ఆగని చర్చలు
-అసలు ఆ గెటప్ కి ఎంత సమయం పడుతుంది
-అంత టైన్ని కూడా బన్నీ లెక్కచేయడం లేదా!
రాకా(రాకా).. రాకా… స్టిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే డిస్కర్షన్. రాక ఎలా ముస్తాబవబోతుంది అని. టీజర్ లో వచ్చిన అల్లు అర్జున్(అల్లు అర్జున్)లుక్ తో అయితే ప్రయోగాత్మ చిత్రమనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు. ఇక నుంచి చూడబోతుంది ఒక ఎత్తు అనడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు అభిమానులు, మూవీ లవర్స్ లో రన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాకాకి సంబంధించిన ఆసక్తికర న్యూస్ నెట్టింట టూ డే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ హోదాలో సర్క్యులేట్ అవుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
అల్లు అర్జున్ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించిన విషయం తెలిసిందే. బహుశా ఆ గెటప్ అతీంద్రియ శక్తులతో కూడిన ‘రాకా’ది కావచ్చు. రాకా గెటప్ ని పూర్తిగా రివీల్ చేసినప్పటికీ గెటప్ యొక్క రేంజ్ ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది. హెడ్ మీద హెయిర్ లేకుండా క్లీన్ షేవ్ తో ఉన్నాడు. చేతులకి ఘోస్ట్ లాగా పొడవటి గోళ్లు ఉన్నాయి. ఫేస్ తో పాటు శరీరం యొక్క ఛాయ కూడా సాధారణ మనిషిగా లేదు. దీన్ని బట్టి మేకప్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మేకప్ కోసం అల్లు అర్జున్ కి ఐదు గంటల సమయం పడుతుందని, అల్లు అర్జున్ మాత్రం ఎంతో ఓపికతో అంత సమయాన్ని కూడా లెక్క చెయ్యడం లేదని చెప్తున్నారు. ఒక్కోసారి ఆ సమయం ఏడు గంటలు కూడా పడుతుందని, అయినా సరే తగ్గేదెలే అనే విధంగా అల్లు అర్జున్ షూట్ లో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు స్పెషల్ గాను నటించింది.
ఇది కూడా చదవండి: నాని: మీ కోసం ఈ సమ్మర్ కే వస్తున్నా.. డేట్ ఇదే
ఎందుకంటే తెలుగు చిత్ర సీమలో రాక లాంటి ప్రయోగాత్మక చిత్రంలో ఏ హీరో ఈ మధ్య కాలంలో చేయలేదు. పైగా సైన్స్ ఫిక్షన్ . దీంతో అల్లు అర్జున్ తెలుగు సినిమాని, తెలుగు నటుల్ని పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా ఎలివేట్ చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నారనే కామెంట్స్ ఫ్యాన్స్, నెటిజెన్స్ నుంచి వినబడుతున్నాయి. అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం అనే న్యూస్ కూడా బాగానే చక్కర్లు కొడుతుంది.
