కడప జిల్లా ఒంటిమిట్ట ఒంటిమిట్ట కోదండ రామాలయంకు చెందిన అర్చకులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీటీడీ ముందస్తు అనుమతి లేకుండా మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం వివాదస్పదమైంది. ఇటీవల అర్చకులు పులివెందుల వెళ్లి వైఎస్ జగన్‌ను కలిసి వేద ఆశీర్వచనం అందజేయడంతో పాటు శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి టీటీడీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంపై అధికా రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, కె.పార్థసారథికి ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో తమ వివరణ సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆలయ సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే ముందు సంబంధిత అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అర్చకుల సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
