వైసీపీ నాయకుడు అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలంటూ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో దళిత సంఘాల నేతలు నిరసన హోరెత్తించారు. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతంలో అనంతబాబు ప్రమేయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను గళమెత్తారు.ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలంటే ప్రధాన నిందితుడు జైలులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయ పలుకుబడితో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం ఆరోపిస్తూ ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలతో పాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఈ నిరసన కార్యక్రమంలో సుప్రీంకోర్టున నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరిస్తూ,డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అనంతబాబును కాపాడే ప్రయత్నం జరిగింది.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని దళిత నాయకుల స్పష్టం చేశారు.
