టాలెంటెడ్ యాక్టర్ సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’ (JETLEE). ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సత్య చేసిన అల్లరి, ఆయన వేసిన ఫన్నీ డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెన్నెల కిషోర్ నుంచి మైక్ గుంజుకుని:
ఈవెంట్ జరుగుతుండగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ వేదికపై మాట్లాడుతున్నారు. షారుఖ్ ఖాన్ గురించి ఆయన ఏదో చెబుతుండగా, సత్య ఒక్కసారిగా మధ్యలోకి వచ్చి కిషోర్ చేతిలో ఉన్న మైక్‌ను సరదాగా గుంజుకున్నారు. “మా టీమ్‌లో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు.. అందుకే ఇవాళ నేనే మాట్లాడతాను” సత్య తనదైన శైలిలో పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
సత్య ఫన్నీ డ్యాన్స్:
కేవలం మాటలతోనే కాకుండా.. తన గెటప్, డ్యాన్స్‌తో కూడా సత్య అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లుగా ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్, ఎల్లో కలర్ జాకెట్‌తో సత్య చాలా వెరైటీగా కనిపించారు. వేదికపై తనదైన స్టైల్లో ఫన్నీగా స్టెప్పులు వేసి ఈవెంట్‌లో జోష్ నింపారు.
‘జెట్లీ’ సినిమాతో సత్య హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన హంగామా చూస్తుంటే, సినిమాలో కూడా వినోదం మామూలుగా ఉండదని అర్థమవుతోంది.
