Home సినిమా ‘విజయ్’పై తండ్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు.. విషయం మొత్తం క్లియర్‌గా అర్థమైంది – Andhra Waves

‘విజయ్’పై తండ్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు.. విషయం మొత్తం క్లియర్‌గా అర్థమైంది – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-రెండు రోజుల్లో ఎలక్షన్స్
-రీసెంట్ గా ఇంటర్వ్యూ గా ఇచ్చిన విజయ్ తండ్రి
-ఏం చెప్పాడో, ఏం అంచనా వేసాడో అర్ధమవుతుంది

ఇళయ దళపతి విజయ్(విజయ్)ఎల్లుండి జరగబోతున్న ఎన్నికల కదనరంగానికి సంబంధించి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో దాదాపు ఉన్నాడు. అభిమానులు కూడా విజయ్ కి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ని చూస్తూనే ఉన్నారు. ఈ కోరికనే విజయ్ తండ్రి చంద్రశేఖర్(SA Chandrasekhar)చెప్పిన మాటలతో విజయ్ ది ఎంత ముందు చూపో తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతు జన నాయకన్ ని ఒప్పుకున్నప్పుడే ఆ చిత్ర నిర్మాతలతో నేను రాజకీయాల్లోకి వెళ్తున్న టైంలో మూవీ చేస్తున్నారు. దీనివల్ల మీకు చాలా అడ్డంకులు ఎదురుకావచ్చు. వీటన్నింటికీ మీరు సిద్ధమేనా అని విజయ్ అడిగాడు. అందుకే జన నాయకన్ కి సెన్సార్ జాప్యం, లీక్ పై మాకేమి ఆశ్చర్యం కలగలేదు. కరెక్ట్ గా రిలీజ్ అయ్యి ఉంటే ఆశ్చర్యపోయే వాళ్ళం. మా అబ్బాయి రాజకీయ ప్రత్యర్థి కావడంతోనే జన నాయకుని లీక్ చేసారు. కుటుంబమా, ప్రజలా అంటే విజయ్ ఓటు ప్రజలకే అని కూడా చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు.

కూడా చదవండి: Parthiban: ఉస్తాద్ భగత్ సింగ్ పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు కీలక తీర్పు.. దేశం ఎటువైపు వెళ్తుంది

ఇప్పుడు ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. చంద్ర శేఖర్ పూర్తి పేరు ఎస్ ఏ చంద్ర శేఖరన్. 1978 తమిళ లో దర్శకుడిగా మారిన చంద్రశేఖర్ చిత్ర రంగంలో అగ్ర దర్శకుడిగా పేరు గడించాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘చట్టానికి కళ్ళు లేవు’ అని తెరక్కించాడు. విజయ్ కి యాక్టింగ్ లో ఓనమాలు నేర్పడంతో పాటు విజయ్ హీరోగా నిలదొక్కుకునేలా తన దర్శకత్వంలో విజయ్ కి మరుపురాని చిత్రాలను అందించాడు. కొన్ని చిత్రాలను నిర్మించాడు కూడా.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird