Home సినిమా నాని లాంచ్ చేసిన ‘వాలా 2’ ట్రైలర్.. 200 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఏముంది? – Andhra Waves

నాని లాంచ్ చేసిన ‘వాలా 2’ ట్రైలర్.. 200 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాలో ఏముంది? – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం ‘వాలా 2’ (వాజా 2) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సవిన్ ఎస్.ఇ. దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. (వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్)

టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, పి.బి. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం, మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నేచురల్ స్టార్ నాని ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. సమాజంలో లూజర్స్ అని ముద్ర పడిన నలుగురు యువకులు, తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? వారి మధ్య ఉండే స్నేహం, అనుబంధం ఏంటి? అనే అంశాలు కామెడీతో పాటు ఎమోషనల్ కోణంలో దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

2024లో వచ్చిన ‘వాలా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్’ ఎంతటి విజయాన్ని అందుకుంటుందో. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘వాలా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’.. కథనం, పాత్రల విషయంలో సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ.. సీక్వెల్ కథ మెయిన్ గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు… కొత్త దశలో వారి ప్రయాణం సాగుతుంది. ట్రైలర్ చూస్తే కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్ తో కట్టిపడేసింది.

ఈ ప్రత్యేకతల్లో ఒకటి ‘ప్రేమమ్’ సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్. అల్‌ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ సినిమా ఇంపాక్ట్ ఇందులో కనిపిస్తుంది.

సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలుస్తోంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది. ‘వాలా 2’ ఈ నెల 24న థియేటర్లలో విడుదలైంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird