శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఉదయం ఉత్కంఠభరిత ఘటన జరిగింది. సాధారణ తనిఖీలు కొనసాగుతున్న సమయంలో అధికారుల దృష్టిని ఆకర్షించిన ఒక ప్రయాణికుడు… చివరకు భారీ బంగారం స్మగ్లింగ్ కేసును బయటపెట్టాడు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గూఢచారి సమాచారంపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి వచ్చిన కార్తీక్ ఖాన్ అనే ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిపై నిఘా పెట్టారు.
ఇండిగో విమానంలో ముంబై నుంచి వచ్చిన అతను, మరో కనెక్టింగ్ ఇండిగో ఫ్లైట్ ద్వారా హుబ్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అధికారులు అడ్డుకున్నారు. మొదటి సాధారణ ప్రశ్నలతో ప్రారంభమైన విచారణ… అనంతరం లగేజీ తనిఖీకి దారితీసింది.
బ్యాగ్ తెరిచిన వెంటనే అధికారులు షాక్‌కు గురయ్యారు. బ్యాగ్‌లో చాకచక్యంగా దాచిన 1990 గ్రాముల అక్రమ బంగారాన్ని పేర్కొన్నారు. వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం. అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్‌పై అధికారులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.
.webp)