
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో చర్చ జరగడం కామన్. ఇప్పుడు ఆయన చేసిన మరో కామెంట్ కూడా అలాంటి చర్చకే కారణమైంది. మన దేశంలోని ముగ్గురు ప్రముఖ నటుల సినిమాల గురించి మాట్లాడుతూ.. వారి వర్క్ హాలీవుడ్ దిగ్గజ నటులు అల్ పాచినో, రాబర్ట్ డి నీరో సినిమాల కంటే గొప్పదని. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టిని ఉద్దేశించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. వీరు తమ కెరీర్లో చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు, అందించిన వినోదం చాలా గొప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. మన స్టార్స్ చేసిన సినిమాల పరిధి, వారి కెరీర్‌లోని వర్క్ చాలా పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అల్ పాచినో, రాబర్ట్ డి నీరో వంటి హాలీవుడ్ దిగ్గజాలతో పోలుస్తూ మాట్లాడటం ఇప్పుడు చర్చకు దారితీసింది.
అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు మన నటుల గొప్ప ఫిల్మోగ్రఫీని గుర్తుచేస్తూ వంగ మాటలకు మద్దతు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం హాలీవుడ్ నటులతో పోల్చడం అతిశయోక్తి అంటూ అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా నటుడిగా సాధించిన గుర్తింపు, సినిమాల సంఖ్య, పాత్రల్లో వైవిధ్యం, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రశంసలు.. వీట పోటీ ఒకే కొలమానంతో పోల్చడం సాధ్యం కాదని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం భారతీయ నటుల ప్రతిభను స్థాయిలో గుర్తించడం మంచి విషయమేనని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: RC17 కాస్టింగ్ కాల్.. రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్.!
నిజానికి సందీప్ రెడ్డి వంగా గతంలోనూ హాలీవుడ్ నటులతో భారతీయ నటులను పోలుస్తూ మాట్లాడారు. ‘యానిమల్’ సినిమా సమయంలో రణ్‌బీర్ కపూర్‌ను రాబర్ట్ డి నీరో, అల్ పాచినో, కమల్ హాసన్‌ల కలయికగా అభివర్ణించారు. ఇప్పుడు మరోసారి అలాంటి పోలికలతో వార్తల్లోకి వచ్చారు.

మొత్తానికి చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టి పేర్లను అల్ పాచినో, రాబర్ట్ డి నీరోలతో పోలుస్తూ సందీప్ చేసిన సినీ అభిమానుల మధ్య చర్చకు తెరలేపాయి.
మీకు నచ్చవచ్చు:
జపాన్‌లో ‘లెనిన్’ రిలీజ్.. ఆ రేంజ్‌కి అఖిల్ వెళ్తాడా.?
‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్.. నితిన్ కమ్‌బ్యాక్ ఇస్తాడా.?
[Sandeep Reddy Vanga, Chiranjeevi, Kamal Haasan, Mammootty, Al Pacino, Robert De Niro]
