Home Latest News ఏపీకి మరో భారీ డేటా సెంటర్: 47 వేల 8 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.! | ఆంధ్ర ప్రదేశ్ | డేటా సెంటర్ | పెట్టుబడులు | అనకాపల్లి | బాలేవాడి టెక్ పార్క్ | SIPB ఆమోదం – Andhra Waves

ఏపీకి మరో భారీ డేటా సెంటర్: 47 వేల 8 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.! | ఆంధ్ర ప్రదేశ్ | డేటా సెంటర్ | పెట్టుబడులు | అనకాపల్లి | బాలేవాడి టెక్ పార్క్ | SIPB ఆమోదం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రానుంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ప్రాంతంలో 47 వేల 009 కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టుబడితో 720 మెగావాట్ల భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి బలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సచివాలయంలో మంగళవారం (నవంబర్ 24) జరిగిన ఈ సమావేశంలో డేటా సెంటర్‌తో పాటు పలు ఇతర పెట్టుబడి ప్రతిపాదనలపై కూడా తీసుకున్నారు.

బలేవాడి టెక్‌పార్క్ సంస్థ మాకవరపాలెంలో డేటా సెంటర్ నిర్మాణం కోసం తూలిపాల సమీపంలో 200 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనితో పాటు విశాఖపట్నం నిర్మాణం కాపులుప్పాడ వద్ద 2,187 కోట్ల పెట్టుబడితో ఐటీ, అనుబంధ రంగాల అభివృద్ధిని ప్రతిపాదించింది. ఈ ఐటీ హబ్ ప్రాజెక్టుకు 30 ఎకరాల భూమి అవసరమని సంస్థ. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కలిపి 29 వేల 600 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఏపీ డేటా సెంటర్ పాలసీ, ఏపీ ల్యాండ్ ఇన్‌సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (ఏపీ లిఫ్ట్), రాష్ట్ర ఐటీ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విధానాల కింద ప్రోత్సాహకాలు కల్పించాలని బలేవాడి టెక్‌పార్క్ కోరింది. డిజిటల్ ఆధునిక సౌకర్యాలు, క్లౌడ్ సేవలు, కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద సామర్థ్యంతో రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం విశేషం.

ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా గూగుల్, అదానీ భాగస్వామ్యంతో 2026 నుంచి 2030 వరకు ఐదేళ్ల కాలంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో, ఇప్పుడు అనకాపల్లిలో మరో డేటా సెంటర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో వరుసగా వస్తున్న ఈ ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ప్రాంత డేటా సెంటర్లు, ఐటీ రంగాలకు కీలకమైన కేంద్రంగా ఎదిగేందుకు మార్గం సుగమమవుతోంది.

ఇది కూడా చదవండి: నిందితురా, బర్నాల్ రాసుకుంటారా: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై వైసీపీకి లోకేష్ సవాల్.!

తాజా ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తం 17 సంస్థల నుంచి 88,392.60 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 54 వేల 210 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. వీటితో పాటు కియా ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సెయింట్ గోబైన్, ఏటీసీ ఏపీ టైర్స్, జెంటారీ రెన్యూవబుల్స్ వంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి.

రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం కకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 24 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా 431 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.15.37 లక్షల కోట్లుగా ఉండగా, సుమారు 11.70 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 1,017 కంపెనీలు రూ.32.5 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి, వాటి ద్వారా దాదాపు 22.7 లక్షల ఉద్యోగాలు రావచ్చని అంచనా.

మీకు నచ్చవచ్చు: ఏపీకి పెట్టుబడులు: సీక్రెట్ ను బయటపెట్టిన లోకేష్.. రహస్య వ్యూహం అనుకరించమంటూ సెటైర్.!

ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!

[AndhraPradesh, Data Center, investments,  Anakapalli, Balewadi Tech Park, SIPB approval,TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird