
భవిష్యత్తులో విద్యుత్ రంగంలో కేవలం ఉత్పత్తి మాత్రమే కీలకం కాదు.. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అవసరమైన సమయంలో వినియోగించుకునేలా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా సౌర, పవన్ విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రపంచ ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ కొత్త ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం పరిసరాల్లోని భౌగోళిక పరిస్థితులు రాష్ట్రానికి భారీ అవకాశాలను కల్పిస్తున్నాయి.
నీటితో పనిచేసే భారీ బ్యాటరీ.!
పంప్ స్టోరేజ్ ప్రాజెక్టును ఒక భారీ నీటి బ్యాటరీగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎత్తులో ఒకటి, దిగువన ఉంటాయి.. ఇలా రెండు రిజర్వాయర్లు. పగటిపూట సౌర, పవన విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఆ విద్యుత్‌ను దిగువ రిజర్వాయర్‌లోని నీటిని పై రిజర్వాయర్‌కు పంపిస్తారు. తిరిగి రాత్రి సమయంలో లేదా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు పై రిజర్వాయర్‌లోని నీటిని కిందకు విడుదల చేస్తారు. ఈ నీటి ప్రవాహంతో టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు.
పోలవరం పరిసరాల్లో 36,050 మెగావాట్ల సామర్థ్యం.!
పోలవరం డ్యామ్ పరిసరాల్లో 27 ప్రాంతాల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులను ఐ-వాల్యూ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విభాగాలు మొత్తం 36,050 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ నిల్వ, ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 113 ప్రాంతాలను పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనువైనవిగా పేర్కొన్నారు. ఇప్పటికే 38,460 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఉన్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి కొత్త గుర్తింపు.!
ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న పాండ్ స్టోరేజ్ ప్రాజెక్టుల సామర్థ్యంతో పోలవరం పరిసరాల్లో గుర్తించే సామర్థ్యం భారీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. పోలవరం పరిసరాల్లో గుర్తించిన 36,050 మెగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.
పట్టాలెక్కుతున్న ప్రాజెక్టులు.!
ఇప్పటికే పలు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా ఏర్పాట్లు. వివిధ ప్రాంతాల ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్రావతి: 500 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు. 2029-30 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
గండికోట-2: 2,250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు SIPB ఆమోదం లభించింది.
రీన్యూ పవర్: 2,000 మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.12,500 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన.
గండికోట: 1,200 మెగావాట్ల సామర్థ్యం.
పెదకోట: 1,800 మెగావాట్ల సామర్థ్యం.
వెంపల్లి: 1,500 మెగావాట్ల సామర్థ్యం.
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ రంగంలో భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. మరోవైపు చైనా పెద్దఎత్తున పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తూ ప్రపంచ స్థాయిలో పోటీలో ముందంజలో కొనసాగుతోంది.
పరిశ్రమలకు నిరంతర గ్రీన్ ఎనర్జీ.!
భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగం మరింత విస్తరించి ఉన్నాయి. వీటికి నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత కీలకం. ఈ అవసరాలను తీర్చడంలో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను స్థిరంగా చేయడంతో విద్యుత్ గ్రిడ్ దోహదపడుతుంది.

పోలవరం పరిసరాల్లో ఉన్న అపార అవకాశాలను సమర్థంగా వినియోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. అయితే, గుర్తించే సామర్థ్యం అంతా ప్రాజెక్టుల రూపంలోకి రావాలంటే అధ్యయనాలు, అనుమతులు, పెట్టుబడులు, నిర్మాణం వంటి కీలక దశలను అధిగమించాల్సి ఉంటుంది. అంటే.. ఇది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన భారీ భవిష్యత్తు అవకాశం మాత్రమే!
మీకు నచ్చవచ్చు: 10 రోజులుగా సముద్రంలో అదృశ్యం..ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు.!
మీకు నచ్చవచ్చు: అటెండర్ మృతి.. కేసీఆర్ తీవ్ర విచారం.!
[ Polavaram Project, Pumped Storage Projects, Andhra Pradesh, Green Energy, Green Energy Hub, Hydropower, Energy Storage, 36050 MW Power Capacity, I-Value, Renewable Energy, Solar Power, Wind Power, Adani Green Energy ]
