Home సినిమా దీపికాకు ఆలియా సపోర్ట్.. – iDreamPost – Andhra Waves

దీపికాకు ఆలియా సపోర్ట్.. – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
దీపికాకు ఆలియా సపోర్ట్.. - iDreamPost


సినిమా షూటింగ్‌ల టైమింగ్స్ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తీసుకున్న నిర్ణయానికి ఇండస్ట్రీలో సపోర్ట్ పెరుగుతోంది. గతంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపిక తప్పుకోవడానికి, ఆమె రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని కండిషన్ పెట్టడమే కారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజోల్, కరీనా కపూర్ లాంటి సీనియర్ హీరోయిన్లు దీపికకు మద్దతుగా నిలవగా.. తాజాగా ఆలియా భట్ కూడా ఆమెకు అండగా నిలిచారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆలియా.. దీపికా పదుకొనేకు తన పూర్తి సపోర్ట్ ఉందని స్పష్టం చేసింది. సినిమా షూటింగ్‌ల పేరుతో రోజుకు 15 నుంచి 18 గంటల పాటు ఏకధాటిగా పని చేయడం ఇండస్ట్రీలో మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తనకు ఇప్పటి వరకు చాలా బాగా అర్థం చేసుకునే నిర్మాతలు దొరికారని, కానీ అందరి పరిస్థితి అలా ఉండదని చెప్పుకొచ్చింది. “సరైన పని వేళలు ఉన్నప్పుడే ఎవరైనా ఉత్సాహంగా, ఇంకా బాగా పని చేయగలరు. మీకు ఇన్ని గంటలే వీలవుతుందని చెబితే, ఎక్కడ సినిమా అవకాశాలు పోతాయో అన్న భయం ఎవరిలోనూ ఉండకూడదు. ఒక నిర్మాతగా నా చేతుల్లో ఉన్నంత వరకు అందరికీ న్యాయమైన పని వేళలు ఉండేలా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాను” అని ఆలియా చెప్పుకొచ్చింది.

అలాగే షూటింగ్ సెట్స్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. 2026లో కూడా సెట్స్‌లో ఆడవాళ్లకు శుభ్రమైన వాష్‌రూమ్‌ల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని చెప్పింది. కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే కాకుండా, సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో గతంలో జరిగిన ‘మీటూ’ ఉద్యమం గురించి కూడా ఆలియా స్పందించింది. వారిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో తాను భవిష్యత్తులో అస్సలు సినిమాలు చేయబోనని తేల్చి చెప్పింది. ఆరోపణలు వచ్చినా కొందరు పెద్దల మీద ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని తప్పుబట్టిన ఆలియా, తాను కూడా సరైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తానని స్పష్టం చేసింది.

రచయిత అవతార్

గణేష్

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird