Home క్రైమ్ Ballari Fake Lakshmi Pooja Case: 5.6 అడుగుల అమ్మాయిలే టార్గెట – Andhra Waves

Ballari Fake Lakshmi Pooja Case: 5.6 అడుగుల అమ్మాయిలే టార్గెట – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Ballari Fake Lakshmi Pooja Case:5.6 అడుగుల ఎత్తున్న అమ్మాయిలు మాత్రమే కావాలి. వారి వంటి మీద పుట్టుమచ్చలు ఉండకూడదు. ఎటువంటి గుర్తులు ఉండకూడదు. అందంగా ఉండాలి. శరీర సౌష్టవం చూడగానే కైపు కలిగించే విధంగా ఉండాలి. అలాంటి అమ్మాయిల కోసం వారు వేట సాగించారు. దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. చివరికి వారు అనుకున్న పని చేశారు. కానీ ఆ తర్వాత అసలు కథ బయటపడింది. కర్ణాటకలోని బళ్లారిలో ఒక నేర వ్యవహారం వెలుగులోకి […]

Ballari Fake Lakshmi Pooja Case:5.6 అడుగుల ఎత్తున్న అమ్మాయిలు మాత్రమే కావాలి. వారి వంటి మీద పుట్టుమచ్చలు ఉండకూడదు. ఎటువంటి గుర్తులు ఉండకూడదు. అందంగా ఉండాలి. శరీర సౌష్టవం చూడగానే కైపు కలిగించే విధంగా ఉండాలి. అలాంటి అమ్మాయిల కోసం వారు వేట సాగించారు. దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. చివరికి వారు అనుకున్న పని చేశారు. కానీ ఆ తర్వాత అసలు కథ బయటపడింది.

కర్ణాటకలోని బళ్లారిలో ఒక నేర వ్యవహారం వెలుగు చూసింది. ఇది సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. లక్ష్మి పూజ చేస్తే ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మించింది ఒక ముఠా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుంది. చివరికి పూజ పేరుతో వారిని వేధింపులకు గురిచేసింది. బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక రొంపిలోకి నెట్టింది. ఈ వ్యవహారంలో బళ్లారి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు అమ్మాయిలను రక్షించారు. మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాదాపు రెండు నెలలపాటు అత్యంత రహస్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పెళ్లికాని మహిళలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక లక్ష్మీ పూజ చేస్తే భారీగా డబ్బులు వస్తాయని నమ్మించింది. పూజ ద్వారా వచ్చే డబ్బులతో వారి మహిళలకు వాటా.. పూజ నిర్వహించే స్వామీజీలకు వాటా.. యువతులను తీసుకొచ్చిన మందులకు వాటా ఇవ్వమని ఈ ముఠా సభ్యులు ఆశపెట్టేవారు.. ముఖ్యంగా పెళ్లికాని మహిళలనే లక్ష్యంగా చేసుకునే వారు. సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉండాలని కోరేవారు. శరీరం మీద ఎటువంటి మచ్చలు.. గుర్తులు ఉండకూడదని చెప్పేవారు. యువతులను పరిశీలించేవారు. వ్యక్తిగత వివరాలను కనుక్కునేవారు. ముఖ్యంగా కుడి చేయి.. కుడికాలు ఖచ్చితంగా పంపించాలని అడిగేవారు.

మహిళలను ఎంపిక చేసిన తర్వాత అసలు వ్యవహారాన్ని ప్రారంభించేవారు. పూజలో భాగంగా వారి దేహం మీద ఉన్న దుస్తులు తొలగించేవారు. చాటుమాటుగా ఫోటోలు.. వీడియో తీసేవారు. ఆ తర్వాత వాటిని బయటపెడతామని బెదిరించేవారు. ఆ మహిళలను దారుణంగా వేధించేవారు. చెప్పుకోలేని పనిని బలవంతంగా అందులోకి నెట్టేవారు. కొంతమంది మహిళలను ఇతర ప్రాంతాలకు కూడా పంపించారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది బాలికల ఫోటోలు కూడా లభించడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇముట కార్యకలాపాలపై సమాచారం లభించడంతో బళ్లారి పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహిళ పోలీసులతో కూడిన అక్క పాడే బృందం రంగంలోకి దిగింది. ఈ బృందంలో ఉన్న సాధారణ మహిళా పోలీసులు మారువేషాలు ధరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిగా నటించారు. ముఠా సభ్యులను సంప్రదించారు. దాదాపు 45 రోజులపాటు రహస్యంగా సేకరించారు. మొత్తం మీద రెండు నెలల తీవ్రమైన నిఘా తర్వాత ముఠా కార్యకలాపాలను గుర్తించి వారి గుట్టు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలను రక్షించారు. అయితే ఈ కేసు కేవలం బళ్లారికి మాత్రమే పరిమితం కాలేదు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముఠాకు బళ్ళారి.. మైసూరు.. చిక్క మంగళూరు. విజయపుర.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్రాంతాలలో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలను ఇతర ప్రాంతాలకు కూడా ఈ ముఠా సభ్యులు. ముఠా సభ్యులు తమ మధ్య జరిగే సంభాషణలలో మీడియా.. పేపర్.. డిఆర్ వంటి కోడు పదాలను ఉపయోగించేవారు.

అయితే ఈ ముఠా వెనక గోవిందమ్మ అనే మహిళతోపాటు మరికొందరు ఉండాలని ఉంది. మొత్తంగా 16 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. డిఆర్ అనే కోడ్ ఉపయోగించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ ముఠా సాగించిన వ్యవహారాల వెనుక ఉన్న స్వామీజీ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird