Home క్రైమ్ Raptadu Incident: రాప్తాడు దుర్మార్గుడి పాపం పండింది… పోలీసులు – Andhra Waves

Raptadu Incident: రాప్తాడు దుర్మార్గుడి పాపం పండింది… పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


రాప్తాడు ఘటన: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం 10వ తరగతి చదివే బాలికపై హేమంత్ అనే దుర్మార్గుడు తరగతి గదిలో చెట్లు కోసే రంపం తో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. అతడు రంపంతో కోయడంతో ఒక చేయి విరిగింది. ముఖం మీద.. అనేక ప్రాంతాల్లో తీవ్రంగా గాయాలు. రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగింది. మొదట్లో స్థానికంగా చికిత్స అందించారు.. అత్యవసర వైద్యం అందించడంతో […]

రాప్తాడు సంఘటన: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం 10వ తరగతి చదివే బాలిక మీద హేమంత్ అనే దుర్మార్గుడు తరగతి గదిలో చెట్లు కోసే రంపం తో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. అతడు రంపంతో కోయడంతో ఒక చేయి విరిగింది. ముఖం మీద.. అనేక ప్రాంతాల్లో తీవ్రంగా గాయాలు. రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగింది.

మొదట్లో స్థానికంగా చికిత్స అందించారు.. అత్యవసర వైద్యం అందించడంతో ఆ బాలికకు బెంగళూరులో అందించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మణి పాల్ ఆసుపత్రికి. అక్కడ వైద్యులు దాదాపు 12 గంటల పాటు ఆమెకు శస్త్ర చికిత్సలు చేశారు. ఆసుపత్రి వైద్యులతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏప్పటికప్పుడు మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్యం గురించి సంప్రదింపులు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత బాలికను నారా లోకేష్ పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ దారుణానికి గురైన హేమంత్ శనివారమే పోలీసులకు చిక్కాడని వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రం దాటిన తర్వాత ఆ దుర్మార్గుడికి సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. హేమంత్ ఆత్మకూరు ప్రాంతంలో ఉన్నాడని.. పోలీసులు అతడిని పట్టుకునే ఎదురు చూస్తున్నాడని.. ఈ నేపథ్యంలో పోలీసులు అతని మీద కాల్పులు జరిపారని. దాదాపు 6 రౌండ్ల పాటు అతని మీద కాల్పులు జరిపారని సమాచారం. పోలీసుల కాల్పుల వల్ల హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారని ప్రచారం.

ఈ ఘటన జరిగిన తర్వాత హేమంత్ ను ఎన్కౌంటర్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. నిన్న జరిగిన ఘటన దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అటువంటి వ్యక్తులకు బతికేందుకు అవకాశం లేదు.. సమాజంలో మృగాల కంటే హీనంగా నటించడానికి హేమంత్ లాంటి వ్యక్తులు బతకకూడదని.. సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ మొత్తం ఆ బాలికను ప్రాణాపాయం నుంచి బయటికి తీసుకొచ్చింది. అయితే పోలీసు వ్యవస్థ హేమంత్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిందని. అతని మీద ఈ లోగానే పోలీసులు కాల్పులు జరపడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird