తరుణ్ భాస్కర్: తరుణ్ భాస్కర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడు. ఈ నగరానికి ఏ… పెళ్లిచూపులు.. వంటి చిత్రాలతో ఇతడు తన రేంజ్ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. సున్నితమైన స్టోరీ.. దానికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు.. హ్యూమర్ జోడించడంలో ఇతడు సిద్ధహస్తుడు. పైగా ఈ కాలపు ప్రేక్షకులకు ఏం కావాలో ఇతడికి బాగా తెలుసు. అందుకే అతడి సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇతడి కెరియర్లో పెళ్లిచూపులు సూపర్ హిట్. ఈ నగరానికి […]
తరుణ్ భాస్కర్: తరుణ్ భాస్కర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడు. ఈ నగరానికి ఏ… పెళ్లిచూపులు.. వంటి చిత్రాలతో ఇతడు తన రేంజ్ ఏమిటో తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. సున్నితమైన స్టోరీ.. దానికి తగ్గట్టుగా కామెడీ సన్నివేశాలు.. హ్యూమర్ జోడించడంలో ఇతడు సిద్ధహస్తుడు. పైగా ఈ కాలపు ప్రేక్షకులకు ఏం కావాలో ఇతడికి బాగా తెలుసు. అందుకే అతడి సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇతడి కెరియర్లో పెళ్లిచూపులు సూపర్ హిట్. ఈ నగరానికి ఏమైంది అంటే సినిమా కూడా భారీగానే వసూలు చేసింది.
ఆ తర్వాత మెగా ఫోన్ పక్కన పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తరుణ్ భాస్కర్ కొనసాగుతున్నారు. మీకు మాత్రమే చెప్తా.. కీడా కోలా వంటి సినిమాలు తరుణ్ భాస్కర్ లో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాయి. దర్శకుడిగా.. నటుడిగా తరుణ్ భాస్కర్ మంచి స్థానంలో ఉన్నాడు. అయితే ఇతడి వ్యక్తిగత జీవితం మాత్రం అనేక ఒడిదుడుకులకు గురైంది. ఇతడి వివాహం విచ్ఛిన్నమైనది. ఆవిడాకుల కేసు.. ఇతర వ్యవహారాల వల్ల ఇతడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇతని జీవితంలోకి ఈశా ప్రవేశించింది. అనంతరం ఇతడి జీవితం పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం విడాకుల కేసు పరిష్కారమైందని అంటున్నారు. ఈషాతో ఇతడు త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది 2 సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈశా.. తరుణ్ భాస్కర్ కలసి ఉన్నారు. ఇద్దరు ప్రివ్యూ షో కూడా చూశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లలో తరుణ్ భాస్కర్ మాతృమూర్తి. తరుణ్ భాస్కర్.. ఈషా లవ్ స్టోరీ ని బయటపెట్టారు. తరుణ్ భాస్కర్ కోర్టు కేసులు.. ఇంకా అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.. ఇప్పుడు అతడికి ఈషా ఉందని.. ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
గతంలో అతడు ఎదుర్కొన్నప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని.. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొనే వాడని.. ఇలాంటి సమయంలో అతడికి ఈషా తోడుగా ఉందని తరుణ్ భాస్కర్ మాతృమూర్తి చెప్పాడు. ఈషా.. తరుణ్ భాస్కర్ మధ్య ఉన్న లవ్ స్టోరీని కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. అలాగే ఈ నగరానికి ఏ 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన సొంతమైంది. త్వరలోనే ఈశా.. తరుణ్ భాస్కర్ వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తారని తెలుస్తోంది.
