Home సినిమా ఈ కిల్లర్ కథ చూస్తే షాకే! – Andhra Waves

ఈ కిల్లర్ కథ చూస్తే షాకే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈ కిల్లర్ కథ చూస్తే షాకే!


క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఓటీటీలో మరో ఆసక్తికరమైన సినిమా ఉంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘కలంకావల్’ .ముఖ్యంగా సైనైడ్ మోహన్ అనే నిజ జీవిత నేరస్థుడి కేసు నుంచి ప్రేరణ పొందిన కథ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో పూర్తి వివరాలు చూడండి.

ఈ సినిమా కథ 2005లో కేరళ, తమిళనాడు సరిహద్దులను కలిగి ఉంది. ఆ ప్రాంతాల్లో వరుసగా యువత అదృశ్యమవుతుండగా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఓ యువతి అదృశ్యమైన కేసును దర్యాప్తు చేసే బాధ్యతను కేరళ స్పెషల్ బ్రాంచ్ అధికారి ఎస్ఐ జయకృష్ణన్ (వినాయకన్) చేపడతారు.

మొదట సాధారణ మిస్సింగ్ కేసులుగా కనిపించిన ఈ ఘటనల వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని ఆయన అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అదృశ్యమైన మహిళలంతా హత్యకు గురయ్యారని తెలుస్తుంది. ఈ వరుస హత్యల వెనుక ఓ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఉన్నాడని జయకృష్ణ గుర్తిస్తారు.

ఇదే సమయంలో తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ అధికారి ఎస్ఐ స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) పరిచయమయ్యారు. బయటకు ఎంతో ప్రశాంతంగా, సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిలా కనిపించే స్టాన్లీ వెనుక భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యం ఏంటి? వరుస హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పోలీసులు ఎలా గుర్తిస్తారు? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ వీక్షించే అవకాశం ఉంది. మొత్తంగా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలు ఇష్టపడేవారికి ‘కలంకావల్’ మంచి ఆప్షన్. ముఖ్యంగా మమ్ముట్టి నటన కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird