Home Latest News మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.? | రేవంత్ రెడ్డి | మోడీ | పెట్టుబడి తెలంగాణ | గ్లోబల్ సమ్మిట్ – Andhra Waves

మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.? | రేవంత్ రెడ్డి | మోడీ | పెట్టుబడి తెలంగాణ | గ్లోబల్ సమ్మిట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు.

కాకుండా రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ఏర్పాట్లకు సంబంధించి ప్రధానికి వివరించారు. తెలంగాణ వేదికగా జరగనున్న ఈ క్రీడా సమ్మిట్‌ను ప్రారంభించాల్సిందిగా మోడీని నిర్ణయించారు.

ఇంకా సాగునీటి ప్రాజెక్టులు, అనుమతులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై కూడా రేవంత్ రెడ్డి ఈ భేటీలో మోడీ వద్ద ప్రస్తావించారు.రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి సహకారం అందించాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రధానికి వివరించారు.

తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈ సమావేశంలో సానుకూల చర్చ జరిగింది.

ఇదికూడా చదవండి: తెలంగాణ సీఎం రేవంత్ కు ప్రధాని మోడీ బంపరాఫర్.. ఏంటో తెలుసా?

క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీ కారణంగా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మరింత బలపడటంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగవంతమైన ఆమోదం లభించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!

జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక ప్రధాని మోడీ?

[RevanthReddy,  Modi, Invest Telangana,  Global Summit, Khelo India TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird