Home సినిమా ఓటిటిలోకి కొత్త లవ్ థ్రిల్లర్ – iDreamPost – Andhra Waves

ఓటిటిలోకి కొత్త లవ్ థ్రిల్లర్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఓటిటిలోకి కొత్త లవ్ థ్రిల్లర్ - iDreamPost


ఓటీటీలో కొత్త సినిమాల కోసం ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన మూవీ వచ్చింది. ప్రేమ, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘అన్బిల్ అవన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన ఈ సినిమా గురించి ఓ లుక్ వేసేయండి..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ హిల్ స్టేషన్‌లో అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు సూర్య. అక్కడే పాతకాలపు హోమ్‌స్టే ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు.

అయితే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. వింత అనుభవాలు, ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఈ సమస్యల నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అనేదే సినిమా కథ.

‘అన్బిల్ అవన్’ నవంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. థియేటర్లలో అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా సుమారు ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. పైగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ప్రేమకథలతో పాటు సస్పెన్స్, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయస్.

మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird