Home సినిమా సాంట్నర్‌తో ముచ్చట్లు.. రోహిత్‌కే కెప్టెన్సీ! – Andhra Waves

సాంట్నర్‌తో ముచ్చట్లు.. రోహిత్‌కే కెప్టెన్సీ! – Andhra Waves

by andhra andhrawave
0 comments
సాంట్నర్‌తో ముచ్చట్లు.. రోహిత్‌కే కెప్టెన్సీ!


ఐపీఎల్ 2027 సీజన్‌లో మరోసారి కెప్టెన్ గా చూడబోతున్నామా..? అదే జరిగితే ముంబై ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త. అయితే వస్తున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉండటం ఖాయం అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత మూడు సీజన్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పాండ్యా స్థానంలో తిరిగి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనికి రోహిత్ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఐపీఎల్ ట్రేడ్ వ్యవహారంలో భాగంగా హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడం దాదాపుగా ఖాయం కావడంతో రోహిత్ కు లైన్ క్లియర్ ఐనట్టుగానే కనిపిస్తోంది.

రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచారు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో హిట్ మ్యాన్ జట్టుకు టైటిళ్లు అందించారు. అయితే 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం బిగ్ షాకింగ్‌కు గురి చేసింది. అప్పటి నుంచి ముంబై జట్టు ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ నిర్ణయంపై కూడా తీవ్ర చర్చ జరిగింది. తాజా నివేదికల ప్రకారం, రోహిత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించాలని ముంబై యాజమాన్యం భావించింది. మొదట భవిష్యత్ కెప్టెన్‌గా తిలక్ వర్మ పేరును సూచించాడు, ఫ్రాంచైజీ కోరడంతో తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం.

రోహిత్‌తో సాంట్నర్ సుదీర్ఘ ముచ్చట్లు!

ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మతో కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చాలాసేపు మాట్లాడటం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది తెలియకపోయినా, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా మారింది. సాంట్నర్ కూడా ముంబై జట్టులో ఉండటంతో వీరిద్దరి మాటలతో రోహిత్ శర్మ మరోసారి ముంబై కెప్టెన్ అంటూ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా రోహిత్ కు ముంబై ఫ్రాంచైజీ సారధ్య బాధ్యతలు అప్పగించిన రోజు రోజుకు బలపడుతున్నాయి. ఏమైనా కొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

The post సాంట్నర్‌తో ముచ్చట్లు.. రోహిత్‌కే కెప్టెన్సీ! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird