
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ప్రైవేటు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మశ్చీంద్ర శాంతారామ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వేరే మార్చాలని ఆయన పిటిషన్లో ఉంది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు, విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ను విచారణ చేపట్టి సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. పిటిషన్ను కొట్టివేసింది. లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రతకు సంబంధించిన ఈ అంశంపై ఇప్పటికే పలు కోణాల్లో జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
[Tirumala Laddu Prasadam Ghee Adulteration Case, Supreme, Dismiss, Petition, Seeking, hearing, Outside AP, CJI Bench, Telugu One]
