Home సినిమా సమీక్ష – కల్ట్ .. – Andhra Waves

సమీక్ష – కల్ట్ .. – Andhra Waves

by andhra andhrawave
0 comments
సమీక్ష – కల్ట్ ..


ఇది ఒక చిత్రమైన సినిమా. రాను రాను మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని మరింత మార్చేద్దామనే ప్రయత్నంతో చేసిన సినిమా అనిపిస్తుంది. విదేశాల్లోని టీవీ రియాల్టీ షోలు, మన దేశంలో ఇతర భాషల్లో వచ్చిన సినిమాల ఇన్సిపిరేషన్ కూడా కొంత కనిపిస్తుంది. ఇది అందరి కప్ ఆఫ్ టీ కాదు. ఈ తరహా హింస, హడావుడి నచ్చే వాళ్లు ఎవరైనా వుంటే వారి కోసం. నిజానికి రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కోసం కూడా ఈ సినిమాను కాస్త పాలిష్ చేసి తీయచ్చు. అలా అయితే మంచి థ్రిల్లర్ అయి వుండేది. కానీ హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ ఎందుకో కొత్త దారిలో వెళ్లాలి అనుకున్నారు. అలాగే వెళ్లారు.

ఇంతకీ ఈ కల్ట్ సినిమా కథేంటీ అంటే…గోవాలో అక్కడి హోమ్ మినిస్టర్ కొడుకు కొంచెం సైకో టైపు పర్సనాలిటీ. లీప్ ఇయర్ లో ఫిబ్రవరి 29న పుట్టాడు కనుక నాలుగేళ్లుగా ఓసారి పుట్టిన రోజు చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి వద్దన్నా వినకుండా భారీగా పుట్టిన రోజు పార్టీ ఓ బిల్డింగ్ లో ఏర్పాటు చేసుకుంటాడు. పార్టీలో వుండే డిజె ఓ మారణహోమ క్రీడ ప్రారంభిస్తాడు. ఎవరు ఎవర్ని చంపుతారో, ఎందుకు చంపుతున్నారో తెలియని పరిస్థితి. అదే భవనంలో వున్న ఇన్ స్పెక్టర్ సంకల్ప్ మీద అక్కడ చేరిన వందలాది మందిని రక్షించాల్సిన బాధ్యత పడుతుంది. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

కథగా చూసుకున్నా, కథలో కీలకమైన పాయింట్ చూసుకున్నా బాగానే వుంటుంది. సరైన క్రయిమ్ థ్రిల్లర్ కు సరిపడా కథ వుంది. కానీ పాత్రలన్నీ చాలా వైవిధ్యంగా, జెన్ జీ అనే స్టైల్ లో ప్రవర్తించేలా, కథనం కూడా ఆ దిశగానే వుండాలని దర్శకుడు విశ్వక్ సేను అనుకున్నాడు. ఎంత వైవిధ్యం అంటే విశ్రాంతి కార్డ్ పడడానికి ముందు కానీ హీరో తెరపైకి రాడు. సినిమా ఆరంభం దగ్గర నుంచి విశ్రాంతి వరకు ప్రేక్షకుడు తెరపై జరుగుతున్న దాన్ని ఫాలోకావడం తప్ప, ఏమిటి అన్నది అంతుపట్టదు. విశ్రాంతి తరువాత కథ మీద క్లారిటీ వస్తుంది. అక్కడ నుంచి ప్రేక్షకుడు కాస్త ఇన్ వాల్వ్ కావడం జరిగింది.

సినిమా తొలిసగం అంతా ఏం జరుగుతుందో తెలియకపోవడం, పదుల కొద్దీ కొత్త మొహాలు, వున్న ఒకటి రెండు ఎస్టాబ్లిష్ ఫేస్ ల నుంచి కూడా సరైన నటన రాబట్టుకోకపోవడం ఇవన్నీ కలిసి కాస్త నీరసాన్ని కలిగిస్తాయి. సెకండాఫ్ ప్రారంభయ్యాక, ఇంత మంచి పాయింట్ వుంది కదా, కాస్త పాలిష్డ్ గా మంచి క్రయిమ్ థ్రిల్లర్ తీసుకోవచ్చు కదా. కానీ నిర్మాతలు, దర్శకుల ఐడియా వేరు. తమ సినిమా జెన్ జీ ఆడియన్స్ కోసం అన్నది వారి ఆలోచన. వాదన. కానీ ఎంత జెన్ జీ అయినా కర్త..కర్మ..క్రియ లేకుండా ఏ కంటెంట్ ను ఎవ్వరూ ఆదరించలేరు. అది తెలుసుకోవాలి ముందు. కథనాన్ని కాస్త డిఫరెంట్ మోడల్‌లోకి మార్చుకుని వెళ్లి వున్నా కాస్త మంచి ఫలితం దక్కేది. కానీ ఇప్పుడు అలా జరగలేదు. సినిమాటిక్ లిబర్టీ అన్నది ఎంత కావాలో అంతా తీసేసుకున్నారు.

సినిమాకు రెండు అంతతో ఇంతో ప్లస్ పాయింట్లు ఎక్కువగా రవిబసూర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, అలాగే యాక్షన్ కోరియోగ్రఫీ. ఎంత వయిలెన్స్ వున్నా కొన్ని సార్లు తప్ప, ఎక్కువగా పెద్దగా కళ్లు తిప్పుకునేంత ఇబ్బంది పెట్టలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, మురళీశర్మ పాత్రలను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. విశ్వక్ సేన్ తానే దర్శకుడు, తానే హీరో అని చెప్పి, తన పాత్రను ఓవర్ ది బోర్డ్ అన్నట్లు తయారు చేయలేదు. ఎంత మేరకు వుండాలో అంత మేరకే చూపించారు.

కానీ ఏం ప్రయోజనం..తొలిసగం అంతా కారణం తెలియని, అర్థం లేని హింస పెట్టి, దాన్ని జెన్ జీ చిత్రీకరణ అనుకోమంటే ఎలా? అక్కడే సినిమా గాడి తన్నేసింది. సాధారణ ఆడియన్స్ కు ఎలాగూ దూరం అయింది. ఈ తరహా సినిమా నచ్చేవారికి కూడా నచ్చకుండా తయారైంది.

ప్లస్ పాయింట్లు

విశ్వక్ సేన్

నేపథ్య సంగీతం

..

మైనస్ పాయింట్లు

కథనం

..

పంచ్ లైన్

మ్యాడ్ మాక్స్

రేటింగ్ 2/5

The post సమీక్ష – కల్ట్ .. appeared first on iDreamPost.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird