Home సినిమా Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన – Andhra Waves

Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం వచ్చేసింది.. చూసిన – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Adarsha Kutumbam: పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు వెంకటేష్ కెరియర్ లో ఉత్తమమైనవి. ఈ సినిమాలకు సంభాషణలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంట సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేశారు. ఆ సినిమాలకు కూడా సంభాషణలు, కథ మాత్రమే అందించారు. మళ్లీ ఇన్నాళ్లకు తొలిసారిగా తనకు లక్కీ చాంప్ అయిన విక్టరీ వెంకటేష్ తో తొలిసారిగా సినిమా తీశారు. సంభాషణల రచయితగా.. కథకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్.. […]

Adarsha Kutumbam: పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు వెంకటేష్ కెరియర్ లో ఉత్తమమైనవి. ఈ సినిమాలకు సంభాషణలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంట సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేశారు. ఆ సినిమాలకు కూడా సంభాషణలు, కథ మాత్రమే అందించారు.

మళ్లీ ఇన్నాళ్లకు తొలిసారిగా తనకు లక్కీ చాంప్ అయిన విక్టరీ వెంకటేష్ తో తొలిసారిగా సినిమా తీశారు. సంభాషణల రచయితగా.. కథకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్.. మొట్టమొదటిసారి మెగా ఫోన్ పట్టారు. శ్రీనిధి శెట్టిని కథనాయికగా తీసుకొని ఈ సినిమా రూపొందించారు. గుంటూరు కారం ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రావడంతో చాలా అంచనాలు పెరిగిపోయాయి. అనేక పర్యాయాలు విడుదల వాయిదా పడటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. మొత్తానికి ప్రేక్షకులు నేడు ముందుకు ఈ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో.. ఈ రివ్యూలో చూడామా..

మాటలతో మాయ చేసే త్రివిక్రమ్.. కుటుంబ కథానాయకుడు వెంకటేష్.. ద్వయం లో వచ్చిన ఆదర్శ కుటుంబం గురించి ప్రేక్షకులు తమ స్పందనను సామాజిక మాధ్యమాలలో చెబుతున్నారు.. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ సినిమా కథలో చిట్టిబాబు (విక్టరీ వెంకటేష్) ఒక బ్యాంకులో పనిచేస్తుంటాడు. ఆయన భార్య స్వర్ణ (శ్రీనిధి) చిట్టిలు నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే అప్పులు చేస్తూ ఉంటుంది. కూతురు సంపూర్ణ (యువీన) ప్రతిసారి ప్రేమలో పడుతూ ఉంటుంది. తండ్రికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్) కు చదువు అంతగా రాదు. అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. చిట్టి బాబుకు ఇబ్బందులు తెస్తూ ఉంటాడు. ఇలా కుటుంబంతో నార్మల్ లైఫ్ గడుపుతున్న చిట్టిబాబు కుటుంబంపై కొందరు దాడి చేస్తారు. పోలీసు అధికారి దామోదర్ నాయుడు (నారా రోహిత్) దర్యాప్తు చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చిట్టిబాబు ఒక్కసారిగా విలాసవంతమైన భవనంలోకి మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు చిట్టిబాబు కుటుంబం పై దాడి చేయడానికి కారణం ఏంటి.. దీని వెనుక ఉన్నది ఎవరు.. ఎందుకు చేయాల్సి వచ్చింది.. చిట్టిబాబు గతంలో ఏం చేశారు.. సమస్యలలో పడిపోయిన తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఆయన ఏం చేశారు.. అనేది మిగిలిన కథ అట.

వెంకటేష్ కుటుంబ కథాచిత్రాల హీరో అని అందరికీ తెలుసు. ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమా స్టోరీని రాసుకున్నారు. కుటుంబంలో ఉండే బంధాలు.. కామెడీ.. భావోద్వేగం.. వంటి అంశాలను పొందుపరిచారు. దానికి నేర నేపథ్యాన్ని.. పోరాటాలను జత చేశారు మొత్తంగా వాణిజ్య కథాచిత్రంగా మార్చారు. మొదటి భాగం మొత్తం కామెడీగా సాగిపోతూ ఉంటుంది. రెండవ భాగం మొత్తం పోరాట ఘట్టాలతో అభిమానులకు రోమాలు నిక్క బొడిచే అనుభూతిని కలిగిస్తుంది. వాస్తవానికి ఇటువంటి కథ కొత్తది కాకపోయినా.. అందులో వినోదం పాళ్లను మరింత పెంచడంతో.. అభిమానులకు ఎటువంటి లోటు లేకుండా పోయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కథనం రాష్ట్ర సమయం వరకు బొమ్మ ఇంకా పడలేదు. బహుశా కొద్ది గంటల వ్యవధిలో ఈ సినిమా పడుతుంది. ఆ తర్వాత అసలు టాక్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇటీవల ఈ సినిమా గురించి ఓవర్సీస్ ఏరియాలలో మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి మన రాష్ట్రాల్లో విడుదలైన తర్వాత జనాలు ఎలా స్వీకరిస్తారు.. తమ అభిప్రాయాన్ని ఎలా వెల్లడిస్తారు.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. గతంలో గుంటూరు కారం సినిమా ప్రారంభం నుంచి నెగటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కమర్షియల్‌గా ఆ సినిమా తమను ఒడ్డున పడేసిందని నిర్మాతలు చెప్పారు. మరి ఇప్పుడు ఈ పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird