Home సినిమా చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనక ట్రైన్ – iDreamPost – Andhra Waves

చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనక ట్రైన్ – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనక ట్రైన్ - iDreamPost


నేటి ఇంటర్నెట్ కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు నిత్యజీవితంలో భాగమైపోయాయి. అయితే అవే ఇయర్‌ఫోన్‌లు నిమిషాల వ్యవధిలో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్న దారుణాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా వెళ్తున్న బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ ఓ యువకుడు వేగంగా వచ్చిన రైలు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పరిసరాలను చెవిలోఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని.. వేరే లోకంలో మునిగిపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని గుర్తించలేదు.

హారన్ మోగించినా వినిపించని వైనం

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బొల్లారం ప్రాంతంలోని రైల్వే ట్రాక్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి ఒక రైలు వేగంగా దూసుకొచ్చింది. ట్రాక్‌పై వెళ్తున్న యువకుడిని గమనించిన లోకో పైలట్ ప్రమాదాన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున హారన్ మోగించాడు. అయితే, చెవుల్లో హెడ్‌ఫోన్‌లు ఉండటంతో ఆ శబ్దం సదరు యువకుడికి వినిపించలేదు. క్షణాల వ్యవధిలో రైలు అతడిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రాణాలు తీస్తున్న ఇయర్‌ఫోన్లు

సంగీతం వింటూ, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు, రైల్వే ట్రాక్ ల మీద నడిచే అలవాటు నేడు ప్రాణాంతకంగా మారుతోంది:

  • రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యం: రైల్వే కాలనీలు, సమీప ప్రాంతాలలో నివసించే ప్రజలు త్వరితగతిన ప్రయాణించేందుకు లేదా వాటిపై నడవడం జరుగుతుంది. ఈ ఇయర్‌ఫోన్స్ వాడటం ప్రాణాల మీదకు తెస్తోంది.
  • రోడ్లపై అజాగ్రత్త: రోడ్లు దాటి, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో నడిచేటప్పుడు కూడా చాలామంది హెడ్‌ఫోన్స్ తీయకుండా ప్రయాణీస్త ప్రమాదాల బారిన పడుతున్నారు.
  • వాహనాలు నడుపుతూ ఇయర్‌ఫోన్స్: బైకులు, కార్లు నడుపుతూ ఫోన్ మాట్లాడటం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల హారన్‌లు వినిపించక రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి.

ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో భూకంపం?

హెచ్చరిస్తున్న పోలీసులు, నిపుణులు

ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దాటడం చట్టరీత్యా నేరమని, ఇది అత్యంత ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక వినోదం కోసం యువత తమ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టవద్దు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ పరిసరాలపై దృష్టి సారించమని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird