Home Uncategorized అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం

అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం

by andhra andhrawave
0 comments

అనకాపల్లి, ఆంధ్రావేవ్స్: జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థిని ముక్కా శ్రావణితో కలిసి 107వ వార్డు నుంచి 112వ వార్డు వరకు కూటమి అభ్యర్థులు, నాయకులు ప్రచార యాత్ర చేపట్టారు. సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్థిని ముక్కా శ్రావణితో పాటు 107వ వార్డు అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లి, 108వ వార్డు అభ్యర్థి కొణతాల సింధుజ, 109వ వార్డు అభ్యర్థి బుద్ధ జ్యోతి, 110వ వార్డు అభ్యర్థి తాడి శాంతి కుమారి, 111వ వార్డు అభ్యర్థి పలక యశోద, 112వ వార్డు అభ్యర్థి ఆళ్ల వైష్ణవి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ హాజరై అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మాజీ శాసనమండలి సభ్యుడు బుద్ధ నాగ జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. సినీ నటుడు జెమినీ గణేష్ పాల్గొనడం ఈ ప్రచార యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రచార యాత్రలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆంధ్రావేవ్స్ | అనకాపల్లి

107 నుంచి 112వ వార్డు వరకు మేయర్ అభ్యర్థిని ముక్కా శ్రావణితో కలిసి కూటమి నేతల ప్రచార యాత్ర

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird