Home సినిమా మళ్లీ పెరిగిన బంగారం ధర.. – iDreamPost – Andhra Waves

మళ్లీ పెరిగిన బంగారం ధర.. – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
మళ్లీ పెరిగిన బంగారం ధర.. - iDreamPost


మిగిలిన పండగల సంగతి తెలియదు కానీ.. దీపావళి పండగ వేళ లక్ష్మి పూజ సందర్భంగా చాలా మంది బంగారం కొనాలని భావిస్తున్నారు. ఈక్రమంలో అక్టోబర్ నెల ప్రారంభం నుంచి వరుసగా దిగి వస్తున్న బంగారం ధర చూసి చాలా మంది దీపావళి పండక్కి పసిడి కొనుగోలు చేయాలని భావించారు. కానీ వారి ఆశలను నిరాశ చేస్తూ.. వరుసగా దిగి వచ్చిన బంగారం మళ్లీ పెరిగింది.
పండుగ కొనుగోళ్ల జోరుతో మార్కెట్‌లో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది, ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉందనే అంచనాలు కూడా పసిడికి కలిసొస్తున్నాయి. ఈ అక్టోబర్ 27వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు

దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం, కిలో వెండి ధరల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • హైదరాబాద్: 24 క్యారెట్ల (10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ. 1,42,760 కాగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,30,860 వద్ద ట్రేడవుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖలలో కూడా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 1,42,760, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,860 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీ: ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,42,910 వద్ద నమోదవ్వగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,31,010గా వద్ద లభిస్తోంది.

వెండి ధర

బంగారంతో పోటీపడుతూ వెండి ధరలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.హైదరాబాద్: భాగ్యనగరంలో కిలోగ్రాము వెండి ధర రూ. 2,19,900గా ట్రేడవుతోంది.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రూములో కేజీ సిల్వర్ ధర. 2,19,900 వద్దే కొనసాగుతోంది

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

దీపావళి పర్వదినం సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని సెంటిమెంట్‌గా చాలామంది నమ్ముతారు. అందుకే ఈ సమయంలో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పూనుకోవడంతో పసిడికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.అంటేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద పసిడి నిల్వలను పెంచుకునేందుకు భారీగా బంగారాన్ని సేకరిస్తున్నాయి. ఈ గ్లోబల్ ట్రెండ్స్ మరియు ద్రవ్యోల్బణ భయాలు పసిడి, వెండి ధరల అమాంతం పుంజుకోవడానికి దారితీశాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird