Home Latest News ఈ ఆహారాలు ఎక్కువ తీసుకుంటే.. శరీరంలో కాల్షియం ఐస్ లా కరిగిపోతుందట..! | ఈ ఆహారాలు ఎక్కువగా తినండి | అవి మీ శరీరంలో కాల్షియంను తగ్గించవచ్చు – Andhra Waves

ఈ ఆహారాలు ఎక్కువ తీసుకుంటే.. శరీరంలో కాల్షియం ఐస్ లా కరిగిపోతుందట..! | ఈ ఆహారాలు ఎక్కువగా తినండి | అవి మీ శరీరంలో కాల్షియంను తగ్గించవచ్చు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


మన శరీరానికి ఎముకలు ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఎముకలు , దంతాలు పటిష్టంగా ఉండటంలో కాల్షియం చాలా అవసరం. ఇది కేవలం ఎముకలను గట్టిపరచడమే కాకుండా, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, నరాల ద్వారా మెదడుకు సంకేతాలు అందడంలో , రక్తం గడ్డకట్టే ప్రక్రియలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది రోజూ పాలు, పెరుగు లాంటివి తీసుకుంటున్నప్పటికీ, వారి శరీరానికి తగినంత కాల్షియం అందడం లేదని ఆందోళన చెందుతారు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పొరపాట్లు ఉండటం వల్ల, అది శరీరంలో కలిసిపోవడానికి బదులుగా నీటిలా కరిగిపోయి వృథాగా బయటకు వెళ్లిపోతుంది. అలా జరగడానికి కారణాలు ఏంటో.. ఆ ఆహారపు పొరపాట్లు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

విటమిన్-డి లేకపోవడం..

కాల్షియం లోపించడానికి ప్రధాన కారణాలలో విటమిన్ డి లేకపోవడం శరీరంలో ఒకటి. మనం ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ, అది ఎముకలకు చేరాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి ఉండటం చాలా అవసరం. ఒకవేళ విటమిన్ డి లోపిస్తే మాత్రం మనం తీసుకునే పోషకాలు పూర్తిగా శోషించబడవు. ఉదయం పూట ఎండలో కాసేపు గడపడం లేదా అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ డి లేకపోతే క్యాల్షియం శరీరంలో పూర్తిగా వృథా అయిపోతుంది.

ఉప్పు..

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే అది ఎముకల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఉప్పులో ఉండే సోడియం ద్వారా బయటకు వెళ్లేటప్పుడు, దానితో శరీరంలోని ముఖ్యమైన కాల్షియం కూడా కరిగిపోయి బయటకు వెళ్లిపోతుంది. చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పచ్చళ్ళు , అతిగా ఉప్పు ఉండే పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా గుల్లబారే ప్రమాదం ఉంది. దీనితో పాటు అతిగా టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారిలో కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది.

కాల్షియం ఆహారాలు తీసుకోకపోవడం..


డైట్‌లో కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్థాలను పూర్తిగా విస్మరించడం కూడా సమస్యను కలిగిస్తుంది. కేవలం ఏదో ఒకటి తింటున్నాము అనుకోకుండా పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు, వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు అందాలంటే ఆహారంలో వెరైటీగా ఉండాలి. అవసరమైతే ఆహార నిపుణులను సంప్రదించి సరైన సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు.

ఆహారాలతో పాటు ధూమపానం , మద్యం సేవించే అలవాట్లు కూడా ఎముకల బలాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యసనాలు శరీరంలో కొత్త ఎముకల తయారీని మందగించి, ఉన్న ఎముకలు వేగంగా బలహీనపడేలా చేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే కాల్షియం పూర్తిగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యలన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజూ కాసేపు నడక వంటి వ్యాయామాలు చేస్తూ, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird