Table of Contents
భారతీయ రైల్వేలో కొలువు సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారీ శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఆర్ఆర్బీ సుమారు 30,000 గ్రూప్-డి ఖాళీల నియామకానికి కసరత్తు వేగవంతం చేసింది. దీపావళి పండుగకు ముందే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సంక్షిప్త ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. పండుగ ముగిసిన వెంటనే పూర్తిస్థాయి వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.
భర్తీ చేసే పోస్టులు ఇవే
ఈ ప్రకటన ద్వారా రైల్వేలోని పలు కీలక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- కీలక విభాగాలు: ప్రధానంగా ట్రాక్ మైంటెయినర్లు, పాయింట్స్‌మెన్ పోస్టులతో పాటు ఇతర సాంకేతికత, సాంకేతిక విభాగాలకు చెందిన ఉద్యోగాలను నింపనున్నారు.
- కాలిక్యులేషన్ ప్రక్రియ: ప్రస్తుతం అన్ని జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్ల నుంచి ఖాళీల జాబితాను ఆర్‌బీ సేకరిస్తోంది. ఈ వివరాల పరిశీలన తర్వాత చేసిన విభాగాలు, కేటగిరీల వారిగా కచ్చితమైన పోస్టుల సంఖ్యపై స్పష్టత రానుంది.
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే
ముందస్తు సమాచారం ప్రకారం ఈ భారీ నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ.. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌కు ఏమాత్రం ఆటంకం కలగకుండా, డిసెంబర్‌లో నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు. దీనివల్ల 2027 నాటి తదుపరి గ్రూప్-డి నియామక ప్రక్రియ కూడా నిర్ణీత సమయానికే కొనసాగే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి : కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. నెలకు రూ. 1.42 లక్షల జీతం.. అస్సలు మిస్ చేసుకోకండి
వచ్చే ఏడాదిలో పరీక్షలు
గ్రూప్-డి నియామకాలకు సంబంధించి మొదటి దశ కంప్యూటర్ ఆధారిత (CBT-1) వచ్చే ఏడాది (2027) మొదటి మూడు నెలల వ్యవధిలోనే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం, సిలబస్ వంటి వివరాల సమగ్ర నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలియనున్నాయి. ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థులు ఇప్పటి నుండి తమ విద్యార్హత సర్టిఫికెట్లను సిద్ధం చేయాలని, తాజా సమాచారం కోసం ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా గమనించాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

