Home సినిమా డార్లింగ్‌తో వంగా వైల్డ్ సెలబ్రేషన్: ‘స్పిరిట్’ ఫొటో వైరల్.! – Andhra Waves

డార్లింగ్‌తో వంగా వైల్డ్ సెలబ్రేషన్: ‘స్పిరిట్’ ఫొటో వైరల్.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన స్టైల్‌లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగా.. ఆయనతో దిగిన ఓ ఫొటోను షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఈ ఫొటోలో ఆయన బాటిల్ ఓపెన్ చేస్తూ కనిపిస్తుండగా, పక్కనే ప్రభాస్ సరదాగా నవ్వుతూ పోజిచ్చారు. ‘స్పిరిటింగ్ థింగ్స్ అప్….’ అనే క్యాప్షన్ ఈ ఫొటోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సినిమా టైటిల్‌ను గుర్తుచేసేలా ఉన్న ఈ క్యాప్షన్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మధ్య ఉన్న ఈ సరదా ఇద్దరి మూమెంట్ చూసి.. ‘స్పిరిట్’లో వంగా ఎలాంటి రచ్చ చేయబోతున్నారో అంటూ నెటిజన్లు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తనదైన మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రభాస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన త్రిప్తి డిమ్రి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ప్రభాస్‌ను వంగా తనదైన శైలిలో ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో. ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు తోడు, తాజాగా షేర్ చేసిన ఫొటో కూడా సినిమాపై చర్చను పెంచుతోంది.

మరోవైపు ఇటీవల ‘స్పిరిట్’ కొత్త విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది. మొదట 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

మొత్తానికి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వంగా షేర్ చేసిన ఈ ఫొటో అభిమానులకు మంచి ట్రీట్‌గా మారింది. ఇక తెరపై ఈ ఇద్దరి కలయిక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: ఎవరీ వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా గాత్రంతో జాతీయ అవార్డు.!

[Prabhas Birthday Celebration, Prabhas Spirit Photo, Prabhas, Sandeep Reddy Vanga, Spirit Movie, Prabhas Birthday, HBD Prabhas, Triptii Dimri, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird