ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించాడు. శ్రీలంకతో గురువారం రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. అంతేకాదు వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ మార్కును అందుకున్న బ్యాటర్‌గా నిలిచిన బ్రూక్.. గిల్ గత నెలలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
16వ ఓవర్లో బెన్ డకెట్ 29 పరుగులకు ఔటైన తర్వాత బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతడు తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులే చేశాడు. క్రమంగా కుదురుకున్న తర్వాత శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కమీందు మెండిస్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో అతడి దూకుడు మొదలైంది. ఆ తర్వాత జనిత్ లియనగే బౌలింగ్‌లోనూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 43 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న బ్రూక్.. జో రూట్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాట్లు, లాఫ్టెడ్ డ్రైవ్‌లు, వినూత్నమైన షాట్లతో ప్రేక్షకులను అలరించాడు.
అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో స్కూప్ షాట్ ఆడి 74 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రూట్ 69 పరుగులకు వెనుదిరిగిన తర్వాత బ్రూక్ మరింత వేగం పెంచాడు. దాసున్ షనక వేసిన 41వ ఓవర్లోనే 20 పరుగులు రాబట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. తర్వాత రివర్స్ స్కూప్‌తో 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు విల్ జాక్స్ కూడా దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ స్కోరు వేగంగా పెరిగింది. 185 పరుగుల వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీలంక ఫీల్డర్లు జారవిడవడం బ్రూక్ కు కలిసొచ్చింది.
ఆఖరి ఓవర్లో డబుల్ సెంచరీకి ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన బ్రూక్, ఆ తర్వాత రెండు డబుల్స్ తీసి చివర్లో వికెట్ కీపర్ మీదుగా స్కూప్ షాట్‌తో బౌండరీ సాధించాడు. దీంతో 114 బంతుల్లో 20 పరుగులు పూర్తి చేసి వన్డే క్రికెట్లో తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. బ్రూక్ విధ్వంసంతో 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది.

