సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ స్టార్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు 550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. సినిమా చూసి ఫిదా అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో క్రేజీ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో..
”రజనీకాంత్ సార్ స్టార్ పవర్, స్వాగ్, ఆరాకు ఈ సినిమా ఒక పక్కా నిదర్శనం. అడ్రినలిన్ పంపింగ్ ఇచ్చే ఒక అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. నా బ్రదర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత ఈ సినిమా కోసం తమ హృదయాన్ని పెట్టి పనిచేశారు. షోమ్యాన్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక కూలెస్ట్ హిట్‌ను అందించారు. చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజనీ గారికే సాధ్యం!” అంటూ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు.
#జైలర్2
@రజినీకాంత్ సర్ స్టార్ పవర్, అక్రమార్జన & ప్రకాశం యొక్క నిజమైన ప్రదర్శన! ఆడ్రినలిన్‌ను పెంచే కమర్షియల్ ఎంటర్టైనర్!
బ్రదర్… @anirudhofficial చంపేశారు! ఈ చిత్రానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలు అందరూ తమ హృదయాలను ధారపోశారు. షోమ్యాన్ @ నెల్సన్డిల్ప్కుమార్ గారు బ్యాంగ్‌తో చక్కని హిట్‌ని అందించారు!
చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం!
మొత్తం టీమ్‌కి అభినందనలు! @సూర్యచిత్రాలు
— అల్లు అర్జున్ (@alluarjun) అక్టోబర్ 22, 2026
The post రజనీని చూస్తే అల్లు అర్జున్‌కు ఇదే గుర్తొచ్చిందట.. పోస్ట్ వైరల్! iDreamPostలో మొదట కనిపించారు.


