Home సినిమా ఆదర్శ కుటుంబం ట్రైలర్: త్రివిక్రమ్‌ని తగ్గించినా వారికి సమాధానమిదే.! – Andhra Waves

ఆదర్శ కుటుంబం ట్రైలర్: త్రివిక్రమ్‌ని తగ్గించినా వారికి సమాధానమిదే.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందించిన సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాల పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ట్రైలర్ విడుదలైంది.

గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, ఆసక్తికరమైన డ్రామాతో ఈ సినిమా ఒక కాంప్లీట్ ఎంటెర్టైనర్ లా నిలుస్తుందనే నమ్మకాన్ని ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ కలిగి ఉంది.

త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా ట్రైలర్.. ఆయన బలమైన రచన, విలక్షణమైన కథా శైలిని మరోసారి చూపిస్తోంది. కుటుంబ వినోదానికి యాక్షన్‌ థ్రిల్లర్‌ అంశాలు జోడిస్తూ ఆసక్తిని పెంచుతోంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్‌లను చక్కగా మేళవించిన ట్రైలర్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందనే అంచనాలను పెంచుతోంది.

వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్, ఆకట్టుకునే స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆయన చూపించిన ఎనర్జీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆయన నటనకు తోడు ఆసక్తికరమైన కథనం, వినోదభరిత సన్నివేశాలు ట్రైలర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు అదనపు బలాన్నిచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తీవ్రతను పెంచుతూ, కథలోని ఉత్కంఠను మరింతగా ఎలివేట్ చేసింది.

20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో సినిమా వస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఆసక్తి చూపారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్‌ ఉన్న ఈ కలయిక.. మరోసారి నవ్వులు, భావోద్వేగాలు, యాక్షన్‌, ఉత్కంఠతో కూడిన పూర్తిస్థాయి వినోదం సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ వీడియో ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అద్భుతమైన ట్రైలర్ తో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ అంశాలతో కూడిన పూర్తిస్థాయి వినోదం అందించబోతోందనే అంచనాలతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్ 30న ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలైంది.

ఆదర్శ కుటుంబం ట్రైలర్

ఇది కూడా చదవండి: రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ.. వారణాసి తర్వాత బిగ్ ప్లాన్.!

[Aadarsha Kutumbam Trailer, Aadarsha Kutumbam Official Trailer, AK47 Trailer, Aadarsha Kutumbam House No 47, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird