మనం ఉండాలనుకోవటంలో తప్పులేదు.. కానీ, అందరికీ నచ్చేలా ఉండాలనుకోవటమే తప్పు. మనం ఎలా ఉన్నా, వంకలు పెట్టే వాళ్లు ఉండనే ఉంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. కొందరు దుర్మార్గులు హీరోయిన్స్ బాడీపై, వారి డ్రెస్సింగ్ స్టైల్‌పై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అనుభవాలే ప్రముఖ యంగ్ హీరోయిన్ అనిష్మ అనిల్‌కుమార్‌కు ఎదురయ్యాయి.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక లుక్స్ విషయంలో ఆమె చుట్టూ ఉన్నవారు, సోషల్ మీడియా నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్లపై అనిష్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని మాటలను బయటపెట్టారు. అనిష్మ మాట్లాడుతూ.. ”నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొందరు నా లుక్స్ మార్చుకోవాలని సూచించారు. నా పళ్లను సరిచేయించుకోవాలన్నారు.
అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటూ రకరకాలుగా చెప్పారు. కేవలం నటిని అయినంత మాత్రాన నన్ను నేను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. నా నటనను విమర్శిస్తే నేను అస్సలు బాధపడను. కానీ నా పుట్టుకతో వచ్చిన రూపం, నా లుక్స్ గురించి తక్కువ చేసి మాట్లాడితేనే చాలా బాధగా ఉంటుంది. నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, నీ లుక్స్‌కు కొన్ని రకాల పాత్రలు అస్సలు సెట్ కావు అని నా ముందే నా తోటివారు అన్నారు.
అప్పుడు చాలా అభద్రతాభావానికి ఉపయోగించాను. బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ భారీగా మేకప్ వేసుకోవడం, జుట్టును ప్రత్యేకంగా స్టైల్ చేయడం, వారికి నచ్చిన బట్టలు వేసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు సాధారణంగా లూజ్ షర్టు, జీన్స్ వేసుకుని తిరగడమే ఇష్టం. ఇతరుల కోసం నన్ను నేను మార్చుకోవాలని ఒక వారం రోజులు ప్రయత్నించి చూశాను.. కానీ ఆ తర్వాత ‘ఇది నేను కాదు’ అనిపించి నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను” అని అన్నారు.

