Home క్రైమ్ టైగర్ ష్రాఫ్ : లారెన్స్ గ్యాంగ్ టైగర్ ష్రాఫ్ కు ఎందుకు గొడవ.. – Andhra Waves

టైగర్ ష్రాఫ్ : లారెన్స్ గ్యాంగ్ టైగర్ ష్రాఫ్ కు ఎందుకు గొడవ.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


టైగర్ ష్రాఫ్ : ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు చేసింది తామే అని లారెన్స్ గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ కాల్పుల్లో టైగర్ కు పెద్ద గాయాలు కాలేదు. ఒకరకంగా చెప్పాలంటే అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ ముంబైలో అది కూడా ఒక పేరు పొందిన సినీ కథానాయకుడు మీద ఈ స్థాయిలో కాల్పులు జరగడం నిజంగా సంచలనం […]

టైగర్ ష్రాఫ్ : ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు చేసింది తామే అని లారెన్స్ గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ కాల్పుల్లో టైగర్ కు పెద్ద గాయాలు కాలేదు. ఒకరకంగా చెప్పాలంటే అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ ముంబైలో అది కూడా ఒక పేరు పొందిన సినీ కథానాయకుడు మీద ఈ స్థాయిలో కాల్పులు జరగడం నిజంగా సంచలనం కలిగిస్తోంది.

టైగర్ త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి పని చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ కు.. లారెన్స్ గ్యాంగ్ కు గొడవలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందువల్లే టైగర్ ను లారెన్స్ గ్యాంగ్ ఎటాక్ చేసింది. సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీయొద్దని టైగర్ కు పరోక్షంగా లారెన్స్ గ్యాంగ్ హెచ్చరికలు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ టైగర్ పట్టించుకోలేదు. దీనితో సరైన సమయం కోసం ప్రస్తుతం లారెన్స్ గ్యాంగ్ సభ్యులు టైగర్ మీద కాల్పులు జరిపారు. ఆ సమయంలో టైగర్ త్రుటిలో తప్పించుకున్నాడు. డ్రైవర్ కు గాయాలు అయినట్టు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముంబై నగరంలో సెలబ్రిటీలకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పైగా సొంతంగా సెక్యూరిటీని కూడా సినీ నటులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థాయిలో కూడా ఇలాంటి కాల్పులు జరిగాయి అంటే మామూలు విషయం కాదు.

ఈ ఘటనను భద్రత వైఫల్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన వెనుక ఉన్న వారిని ఎవరైనా సరే వదిలిపెట్టబోమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారంతా కూడా దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ముంబై నగరంలో ఇదే స్థాయిలో మాఫియా గ్యాంగ్ అరాచకాలు కొనసాగుతున్నాయి. అయితే క్రమక్రమంగా మాఫియా మీద ఒత్తిడి తీసుకురావడం.. పోలీసులు అత్యంత పారదర్శకంగా పనిచేయడం వల్ల మాఫియా గ్యాంగ్ ఆగడాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ స్థాయిలో కాల్పులు జరగడం.. అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో జూహూ ప్రాంతంలో సెలబ్రిటీలు ఉంటారు. వారంతా కూడా అక్కడే విలాసవంతమైన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో కాల్పులు జరిగాయి.. మామూలు విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు. పోలీసులు ఏ స్థాయిలో దర్యాప్తు చేస్తారు.. దీని వెనుక ఉన్న వ్యక్తులను ఎలా పట్టుకుంటారు.. ఈ ప్రశ్నలకు త్వరగా సమాధానం లభించాల్సిన అవసరం ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird