Home క్రైమ్ Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు.. – Andhra Waves

Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



షాబాద్ రంగారెడ్డి ఘటన

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన భార్య.. ఇద్దరు కుమారులను.. దారుణంగా అంతం చేసిన అతడు.. ఓ బాలికను.. ఆమె తల్లి.. నాయనమ్మను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

రంగారెడ్డి ఏర్పాటు షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకేసారి ఆరుగురు దారుణమైన హత్యకు గురికావడంతో కలకలం రేగింది. షాబాద్ మండల పరిధిలోని దైవాల గూడ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది.. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి మీద ఫోక్సో కేసు పెట్టారనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు పెట్టిన బాలిక.. ఆమె తల్లి లక్ష్మి.. నాయనమ్మ రుక్కమ్మను కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు. దైవాలగూడ ప్రాంతంలో తన భార్య సరితను.. ఇద్దరు పిల్లలను కత్తితో మెడ నరికి చంపేశాడు. ఆ తర్వాత షాబాద్ లో ఉన్న పి ఆర్ ఆర్ స్టేడియం సమీపంలో నివాసం ఉంటున్న బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను బలవంతంగా బయటికి లాక్కుని వచ్చాడు. ఆమె తల్లి.. నాయనమ్మ అడ్డగించే ప్రయత్నం చేస్తే.. కత్తితో వారిని అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆ బాలికను దైవాల గూడలోని చెరువు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతు కోసి అత్యంత క్రూరంగా చంపేశాడు.

ఆ బాలిక తండ్రి అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి అతడు.. మీ వాళ్ళందరినీ చంపేశాను.. తర్వాత టార్గెట్ నువ్వే అంటూ హెచ్చరించాడు. ఈ దుర్ఘటనలకు ముందు అతడు ఒక నిర్జన ప్రదేశంలో ఏడు ఇటుకలను పేర్చాడు. ఆ ఇటుకలను ఏడు ప్రాణాలుగా అతడు భావించినట్లు. ఇప్పటికే అతడు ఆరుగురిని చంపడంతో.. ఏడవ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఆ బాలిక అరుణ్ కుమార్ ఏడవ వ్యక్తి అయి ఉంటాడని తండ్రి. కాగా ఈ ఏడాది మే 16న అరుణ్ కుమార్ తన కుమార్తెను రాజ్ కుమార్ వేదించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతని మీద పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడు అరెస్టు అయ్యాడు.. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు.. ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజ్ కుమార్ సరిగా ఏడు సంవత్సరాల క్రితం సరితను వివాహం చేసుకున్నాడు. వారిద్దరిది ప్రేమ వివాహం.. ఇక్కడ జరిగిన తర్వాత రాజ్ కుమార్ ను అప్పగించాలని మృతుల బంధువులు ఆందోళన చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird