Home సినిమా పీవీ సింధు : వెండి బతుకమ్మతో పీవీ సింధు.. పండుగపై మీ పైత్యం చూపొద్దంటూ – Andhra Waves

పీవీ సింధు : వెండి బతుకమ్మతో పీవీ సింధు.. పండుగపై మీ పైత్యం చూపొద్దంటూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
పీవీ సింధు : వెండి బతుకమ్మతో పీవీ సింధు.. పండుగపై మీ పైత్యం చూపొద్దంటూ


తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే సంబరం ‘బతుకమ్మ’. తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ట్యాంక్ బండ్ వేదికగా సద్దుల బతుకమ్మతో ఈ ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. ఈక్రమంలో బతుకమ్మ పండగ సందర్భంగా బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత పీవీ సింధు చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. పండగపై మీ పైత్యం రుద్దకండి అంటూ ఓ నెటిజన్ చేసిన కామంత్ కు సింధు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు దూరమయ్యానంటూ పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో పీవీ సింధు చేతిలో వెండి బతుకమ్మ పట్టుకుని కనిపించారు. ఒక నెటిజన్ సూచనూ… ‘కేవలం పూలు పేర్చితేనే దాన్ని బతుకమ్మ అంటారు, పండుగపై మీ పైత్యాన్ని రుద్దకండి’ అని అనుచితంగా వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్‌పై పీవీ సింధు చాలా హుందాగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ.. ప్రత్యేక ఆకర్షణగా విరోష్ జంట

“దయచేసి ఎదుటి వ్యక్తులపై అభిప్రాయానికి వచ్చే ముందు ఈ సంప్రదాయాన్ని అర్థం చేసుకోండి.

కరీంనగర్ కోడలిగా…

తన వ్యక్తిగత జీవితం, ఆచారాల గురించి వివరిస్తూ, తెలంగాణకు నడిబొడ్డున ఉన్న కరీంనగర్‌కు చెందిన కుటుంబంలోకి తాను కోడలిగా అడుగుపెట్టానని సింధు ఏర్పాటు చేసింది. అలానే తన ఫోటో వెనుక కనిపించే పెద్ద పూల బతుకమ్మను రోజంతా ఎంతో ఇష్టపడి సమయం వెచ్చించి స్వయంగా తానే పేర్చానని, దాంతోనే పండుగ సంబరాలు జరుపుకున్నామని స్పష్టం చేశారు.

అత్తగారి ప్రేమకు నిదర్శనం

చేతిలో ఉన్న వెండి బతుకమ్మ గురించి చెబుతూ, “నాకు కొత్తదైన ఈ సంప్రదాయంలోకి నన్ను ఆత్మీయంగా ఆహ్వానించడానికి మా అత్తగారు (అమ్మ) చూపించిన ప్రేమకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. సంప్రదాయంతో పాటు ఒక అమ్మ ప్రేమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది” అని సింధు ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చారు.

తెలంగాణ పూల వేడుకల్లోని రంగులు, పండుగ వాతావరణం, ప్రకృతితో మమేకమైన సంస్కృతిని ఈ ఏడాది ఎంతగానో మిస్ అవుతున్నానని, దూరంగా తన మనసంతా ఈ పూల సంబరాల చుట్టూనే ఉందంటూ సింధు చేసిన వ్యాఖ్యలకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird