Home తెలంగాణ BRS vs Congress : ప్యారడైజ్ రిలీజ్ వేళ ఎందుకీ రాజకీయ – Andhra Waves

BRS vs Congress : ప్యారడైజ్ రిలీజ్ వేళ ఎందుకీ రాజకీయ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


BRS vs Congress : నాని హీరోగా.. కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు ప్రతి నాయకుడిగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ముందు.. అమెరికా, ఇతర దేశాలలో ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమా అభిమానులను అలరించిందా.. హైప్ ఇచ్చినట్టుగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయా.. అనే విషయాలు పక్కన పెడితే.. ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు […]

BRS vs Congress : నాని హీరోగా.. కాయదు లోహర్ హీరోయిన్ గా.. మోహన్ బాబు ప్రతి నాయకుడిగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ముందు.. అమెరికా, ఇతర దేశాలలో ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఈ సినిమా అభిమానులను అలరించిందా.. హైప్ ఇచ్చినట్టుగా ఇందులో సన్నివేశాలు ఉన్నాయా.. అనే విషయాలు పక్కన పెడితే.. ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. నాని సినిమా చుట్టూ విపరీతమైన చర్చ నడుస్తోంది.

ఈ సినిమా సెన్సార్ ప్రక్రియలో రాజకీయ ప్రస్తావనలు వచ్చాయి. వివాదస్పద డైలాగులు కూడా ఉన్నాయని సమాచారం. సెన్సార్ సభ్యులు మార్పులు సూచించినట్లు సమాచారం. కొన్ని తెలుగు మీడియా కథనాల ప్రకారం సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్కులు సూచించినట్లు తెలుస్తోంది.. ది ప్యారడైజ్ కథలో సామాజిక, రాజకీయ అంశాలకు చోటు దక్కింది. నిజానికి ఇది ప్రచారం అనుకున్నారు కానీ.. సినిమా చూసిన తర్వాత ఇది నిజంగా తేలిపోయింది. సెన్సార్ సమయంలో సమీకరణ రాజకీయ నాయకుల పేర్లు.. రాజకీయ వ్యవస్థ పై వ్యాఖ్యలు.. కొన్ని డైలాగుల విషయంలో అభ్యంతరం వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ డైలాగులు ఎవరిని ఉద్దేశించి చేశారు అనే దానిమీద సెన్సార్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే సినిమా చూసిన తర్వాత ఆ డైలాగులు ఎవరిని ఉద్దేశించి అన్నారు..

ఈ సినిమా విడుదలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ ప్రయాణానికి సంబంధించి హీరో నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.. విజయ్ రాజకీయ ఎదుగుదల కేవలం స్టార్ డం లేదా సాధించిన కలెక్షన్ల వల్ల మాత్రమే కాదని.. ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధమే ఓ కారణమని నాని పేర్కొన్నారు. కెసిఆర్ పాత్రను ఉద్దేశించి గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. థియేటర్లు తగలబడి పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు దీనికి తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ కెసిఆర్ సినిమాలో పాత్రధారి పొగ తాగుతూ ఉంటాడు. దేశ్ కి నేతను చివరికి స్మోకర్ ను చేసారు. కాంగ్రెస్ నాయకులు కామెంట్లు చేస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను ఒక వర్గం వారు స్వాగతిస్తుంటే.. మరో వర్గం వారు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ది ప్యారడైజ్ సినిమా రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది… మరి చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird