పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కుప్పం మీద ప్రధానంగా దృష్టి సారించారు. నాడు నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను తీవ్రంగా భయపెట్టారు. అయినప్పటికీ టిడిపి నేతలు వెనుకాడ లేదు. పైగా పోటీకి సాయి అన్నారు. విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా ‘దేశం’ కుప్పంలోనే కాదు.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపికి బలమైన పోటీ ఇచ్చింది. ఇప్పుడు అధికారం లేదు. 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన దుస్థితి వైసిపిది. పైగా ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థలకు […]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కుప్పం మీద ప్రధానంగా దృష్టి సారించారు. నాడు నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను తీవ్రంగా భయపెట్టారు. అయినప్పటికీ టిడిపి నేతలు వెనుకాడ లేదు. పైగా పోటీకి సాయి అన్నారు. విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా ‘దేశం’ కుప్పంలోనే కాదు.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపికి బలమైన పోటీ ఇచ్చింది.
ఇప్పుడు అధికారం లేదు. 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన దుస్థితి వైసిపిది. పైగా ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేదిశగా పోరాటం.. కష్టపడాలని నేతలకు చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అలాగని ఏకగ్రీవాలు చేసుకోవాలని చెప్పడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలకు. అంతేకాదు శ్రేణులు అలానే వ్యవహరించాలని.. సూచించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అలాంటి పని చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల కంటే ఎక్కువ స్థాయిలో పుంగనూరు ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయి. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం చెప్పిందే వేదం. అక్కడ వారు చేసిందే రాజకీయం. అదంతా కూడా రంగస్థలం సినిమాను తలపిస్తూ ఉంటుంది. ఇటీవల పుంగనూరులో పెద్దిరెడ్డి కుమారుడు చేసిన హంగామా అందరికీ గుర్తు ఉంటుంది. టిడిపి కార్యకర్తలను తొక్కడానికి ఏకంగా ఆయన వాహనాన్ని ఉపయోగించడం ద్వారా సభ్య సమాజం మొత్తం చూసింది. ప్రజల నుంచి తిరుగుబాటు రావడం.. క్షేత్రస్థాయిలో విపరీతమైన ఆగ్రహం ఉండటంతో గెలిచే అవకాశం లేదని రామచంద్ర రెడ్డి అనుకున్నారు. అంతేకాదు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు. ఒక రకంగా ఆయన ప్రకటన స్థానిక ఎన్నికల నుంచి పారిపోయినట్టే అనుకోవాలని టిడిపి నేతలు అంటున్నారు.
పైగా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు పెద్దిరెడ్డి ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చాలా వింతగా ఉన్నాయి. రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అణచివేత అధికంగా ఉందట . ఇలాంటి ఎన్నికల్లో ఎలా పోటీ ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది చంద్రబాబు మీద ఉంది. కేసులు పెడుతున్నారు.. ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు.. భయబ్రాంతులకు గురిచేసిన పెద్దిరెడ్డి వాపోయారు. నామినేషన్ వేయనీయడం లేదని.. ప్రజాస్వామ్యంగా వ్యవహరించారని వివరించారు. ఇన్ని మాటలు మాట్లాడిన పెద్దిరెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు పుంగనూరు ప్రాంతంలో ఎన్ని దాడులు చేశారో తెలియదా.
దశాబ్ద కాలంగా పుంగనూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పెద్దిరెడ్డి.. ఎన్నికల సమయంలో తనకు ఎదురులేకుండా ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టలేదా.. ఇప్పుడు కాలం మారింది.. అందుకే పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ప్రజల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. అందువల్లే ఆయన అర్థాంతరంగాడుగు వేస్తున్నారు.. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను వైసీపీ నేతలు వెనకడుగు వేస్తున్నారు. లేని గొడవలు సృష్టిస్తున్నారు. అందువల్లే పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాల్సి వస్తుంది. దీనిని వైసీపీ నేతలు వేరే విధంగా ప్రచారం చేసుకోవడం వారి నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని టిడిపి నేతలు అంటున్నారు.
