Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు: బీసీలకు ఇన్ని పథకాలా.. చంద్రబాబు – Andhra Waves

చంద్రబాబు నాయుడు: బీసీలకు ఇన్ని పథకాలా.. చంద్రబాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు:వస్తున్నా మీకోసం యాత్ర జరుగుతున్నప్పుడు.. ఒక పాటను విడుదల చేశారు. ఆ పాటలో సాలరీ మగ్గం.. జాలరి వల.. కమ్మరి చేత.. మగ్గం నేత.. ఆదుకోవడానికి.. ఆదరించడానికి.. వస్తున్నా మీకోసం.. ఇలా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన కులవృత్తులను ప్రధానంగా ప్రస్తావిస్తూ పాటను రూపొందించి.. విడుదల చేశారు. ఆ పాట కాస్త ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత టిడిపికి తిరుగులేని స్థాయిని తెలంగాణ రాష్ట్రంలో అందించింది. టిడిపి బీసీల పార్టీ అని ఎప్పటినుంచో ఉంది. సీనియర్ […]

చంద్రబాబు నాయుడు:వస్తున్నా మీకోసం యాత్ర జరుగుతున్నప్పుడు.. ఒక పాటను విడుదల చేశారు. ఆ పాటలో సాలరీ మగ్గం.. జాలరి వల.. కమ్మరి చేత.. మగ్గం నేత.. ఆదుకోవడానికి.. ఆదరించడానికి.. వస్తున్నా మీకోసం.. ఇలా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన కులవృత్తులను ప్రధానంగా ప్రస్తావిస్తూ పాటను రూపొందించి.. విడుదల చేశారు. ఆ పాట కాస్త ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత టిడిపికి తిరుగులేని స్థాయిని తెలంగాణ రాష్ట్రంలో అందించింది.

టిడిపి బీసీల పార్టీ అని ఎప్పటినుంచో ఉంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుపెడితే ఇప్పటి చంద్రబాబు నాయుడు వరకు.. బీసీలకు సింహభాగం కేటాయిస్తూనే ఉన్నారు. ఎంతోమంది నాయకులు టిడిపి ద్వారా తమ రాజకీయ కార్య క్షేత్రాన్ని గుర్తించడం. ఎన్నో పదవులను అధిష్టించారు. గల్లి నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పారు. తెలుగువారి స్థాయిని మరింత పెంచారు.

వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 34 శాతాన్ని కల్పించిన ఘనత ముమ్మాటికి టిడిపిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిర్ణయం తీసుకుని.. పార్టీపరంగా అమలు చేశారు. అంతేకాదు బీసీలకు బ్రహ్మాండంగా అవకాశాలు ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ సభ్యుల వరకు ప్రతి సౌకర్యాన్ని కల్పించి టిడిపి బడుగు బలహీన వర్గాల పార్టీ అని ముద్రవేశారు. కేవలం రాజకీయ అవకాశాలు మాత్రమే కాదు.. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బ్రహ్మాండంగా పథకాలు అమలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న స్కీమ్ లు.. ఇతర దేశంలో ఇతరత్రా వ్యవహారాలకు బీజం వేసింది ముమ్మాటికి టిడిపినే. ఈ భోజనం లబ్ద ప్రతిష్టులైన రాజకీయ నాయకులు ఒప్పుకుంటారు. ఎందుకంటే టిడిపి అవకాశాలు పార్టీ కాదు. అవకాశాలు కల్పించే పార్టీ. అధికారంలో ప్రతి విషయంలోనూ ఒక క్రమశిక్షణ అంటూ ఉంటుంది. అందువల్లే ఆ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. తొక్కేయాలని.. ఎలాంటి కుట్రలు చేసినప్పటికీ నిలబడలేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినప్పుడు.. ప్రస్తుతం పని చేస్తున్నప్పుడు బీసీలకు అనేక రకాలుగా వెల్పేర్ స్కీమ్స్ అమలు చేయబడ్డాయి. వాటన్నిటిని కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా స్కీమ్స్ ప్రవేశపెట్టకుండా.. బీసీల ఆర్థిక ఉన్నతి కోసం.. వారి జీవన ఉపాధి కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. అందువల్ల బీసీలకు ఏకంగా పార్టీపరంగా 34% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మామూలు విషయం కాదు. పదవులు కూడా వారికి ప్రకటించడం చంద్రబాబు ధైర్యానికి ఒక నిదర్శనం.

బీసీలకు ఫెడరేషన్లు.. బీసీల కులవృత్తులు.. బీసీల చేతివృత్తులను పరిరక్షించేందుకు.. వారికి జీవన ఉపాధి కల్పించేందుకు నాడు టీడీపీ ఆధ్వర్యంలో ఆదరణ వంటి పథకాలను తీసుకొచ్చారు. ఆదరణ పథకం కింద దాదాపు 341 పనిముట్లను 90% రాయితీతో అందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడ్డెరలకు 10 శాతం మైనింగ్ లీజులను.. గీత కార్మికుల కోసం 10% ఎక్సైజ్ షాపులు కేటాయించింది. నేతన్న సేవలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25వేల రూపాయల సహాయం ప్రభుత్వం అందిస్తోంది. హ్యాండ్లూమ్ మగ్గాలకు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు.. పవర్ లూమ్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తోంది.

వేట ను నిషేధించిన సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించే పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా వేటవిరామం సమయంలో మత్స్యకారులకు 20వేల వరకు ప్రభుత్వం ఇస్తుంది. రాయితీలో బోట్లు డీజిల్ కూడా అందిస్తోంది. తీర ప్రాంతంలో వేటపై హక్కులకు రక్షణ కల్పిస్తోంది. గత ప్రభుత్వం అన్యాయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 పూర్తిగా రద్దుచేసి మత్స్యకార సొసైటీల హక్కులను ప్రభుత్వం కాపాడింది. మత్స్యకార మహిళలకు సీడ్‌ పెంపకంపై ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ఉపాధి కూడా కల్పిస్తోంది. నాయి బ్రాహ్మణులు నిర్వహించే చెరువులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా తీసుకొచ్చింది. దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకు భృతి ని 15 నుంచి 25 వేల వరకు పెంచింది. ఇన్ని చేసిన టిడిపి 34 శాతం రిజర్వేషన్ కూడా పార్టీ పరంగా ఇస్తుంది. అందుకే ఎన్నికల్లో టిడిపికి బీసీలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని అందించాల్సిన సందర్భం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird