Home క్రైమ్ Rupa Reddy Case: నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి కేసు.. ఆమె చదువు చెప్పిన విద్యార్థులే..ఇలా దొరికారు.. – Andhra Waves

Rupa Reddy Case: నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి కేసు.. ఆమె చదువు చెప్పిన విద్యార్థులే..ఇలా దొరికారు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


రూపా రెడ్డి కేసు: తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో కొండ మల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఉదంతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో ఒక్క చిన్న ఆధారం కూడా లభించలేదు. దీంతో ఎవరు ఈ ఘాతుకానికి దారితీసింది అనేది తేలకుండా పోయింది.. దీంతో పోలీసులు దాదాపు ఐదు బృందాలుగా విడిపోయారు.. డెబ్బై సీసీలను పరిశీలించారు. బాబు అనే పదం ఆధారంగా.. రూపా రెడ్డి చివరిసారిగా ఆమె తన పిన్నితో […]

రూపా రెడ్డి కేసు: తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో కొండ మల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఉదంతం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో ఒక్క చిన్న ఆధారం కూడా లభించలేదు. దీంతో ఎవరు ఈ ఘాతుకానికి దారితీసింది అనేది తేలకుండా పోయింది.. దీంతో పోలీసులు దాదాపు ఐదు బృందాలుగా విడిపోయారు.. డెబ్బై సీసీలను పరిశీలించారు.

బాబు అనే పదం ఆధారంగా..

రూపా రెడ్డి చివరిసారిగా ఆమె తన పిన్నితో మాట్లాడింది.. అప్పుడు ఆమె నోటి నుంచి బాబు అనే పదం వినిపించింది.. అయితే రూపా రెడ్డి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉన్న నేపథ్యంలో.. తాను చదువు చెప్పే పిల్లల్ని కూడా బాబు అని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు చిన్న అనుమానం వచ్చి అక్కడ నుంచి విచారణ మొదలుపెట్టారు.. రూపా రెడ్డి ఉదంతం తర్వాత నాలుగు రోజులపాటు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ స్కూల్ ను రీ ఓపెన్ చేశారు. ఆ సమయంలో పాఠశాలకు దాదాపు 13 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఇందులో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు విద్యార్థుల డబ్బు భారీగా ఖర్చు చేస్తూ.. జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అద్భుతాలకు తీసుకొని విచారించారు. ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి దగ్గర 1.54 లక్షల నగదు నమోదైంది. అంత డబ్బు ఎక్కడిది అని పోలీసులు ప్రశ్నిస్తే.. తన తల్లిదండ్రులు ఇచ్చారని ఆ విద్యార్థి చెప్పాడు. అతని వద్ద లభించిన కరెన్సీ నోట్ల మీద నెత్తుటి మరకలు కనిపించాయి.. దీంతో ఆ నోట్లను పరీక్ష కేంద్రానికి పోలీసులు పంపించారు.. అయితే ఆ రక్తం రూపారెడ్డి అని నిర్ధారణ అయింది.

హాస్టల్లో విద్యార్థిని డే ప్రదానంగా మార్చింది

ఈ దారుణానికి హాజరైన విద్యార్థుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవారు. అతనికి మద్యం తాగే అలవాటు ఉండేది. ద్విచక్ర వాహనాలు అంటే అతనికి విపరీతమైన ఇష్టం ఉండేది. అతడి బ్యాగులో నగదు కూడా ఉండేది. ఫోన్ కూడా వాడేవాడు. ఈ నేపథ్యంలో రూపా రెడ్డి అతడిని మందలించింది. హాస్టల్ నుంచి ఇంటికి పంపించింది. డే అదనంగా మార్చింది. అప్పటినుంచి అతడు ఆమె మీద కోపం పెంచుకున్నాడు. సరిగ్గా నెల క్రితం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు గోవాకు వెళ్లాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని భావించాడు. అదే లక్ష్యంతో ఐదు రోజుల క్రితం రూపారెడ్డి ఇంట్లో దొంగతనం చేయడానికి రెక్కీ నిర్వహించారు. రూప రెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజు డబ్బులు ఉంటాయని తెలుసుకున్నాడు..

మాస్కులు వేసుకొని వెళ్లారు

ఈ నెల 11న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు విద్యార్థులు కలిసి ప్రిన్సిపాల్ ఇంటికి మాస్కులు వేసుకొని గోడదూకి వెళ్లారు.. అందులో ఒక విద్యార్థి మాస్క్ పడిపోయింది. అతడిని రూపా రెడ్డి గుర్తించింది.. అయితే అతడు ఆమెపై 27 సార్లు కత్తితో తీవ్ర స్థాయిలో దాడి చేశాడు.. ఈ కారణంగా ఆమె ఫోన్ కింద పడిపోయింది.. దానిని తీసుకొని.. నగదుతో పారిపోయాడు. వ్యక్తుల నుంచి 1.54 లక్షల నగదు.. ఒక ఐఫోన్.. రూపా రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ దారుణానికి గురైన వారు మొత్తం మైనర్లు కాబట్టి.. వారిని జువైనల్ కోర్టుకు పోలీసులు పంపించారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird