Home క్రైమ్ వాహనంలో భారీ చోరీ.. చేతబడి చేస్తే దొంగ బయటికి – Andhra Waves

వాహనంలో భారీ చోరీ.. చేతబడి చేస్తే దొంగ బయటికి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


కష్టపడకుండా సొమ్ము సంపాదించాలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోవాలి.. నేటి కాలంలో చాలామంది వ్యవహార శైలి ఇలాగే ఉంది. డబ్బులు సంపాదించడానికి ఎటువంటి దుర్మార్గాలకైనా.. ఎటువంటి అన్యాయాలకైనా ఉండటానికి వెనుకంజ వేయడం లేదు. అందుకే నేటి కాలంలో దుర్మార్గాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలో ఒక కుటుంబం […]

కష్టపడకుండా సొమ్ము సంపాదించాలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోవాలి.. నేటి కాలంలో చాలామంది వ్యవహార శైలి ఇలాగే ఉంది. డబ్బులు సంపాదించడానికి ఎటువంటి దుర్మార్గాలకైనా.. ఎటువంటి అన్యాయాలకైనా ఉండటానికి వెనుకంజ వేయడం లేదు. అందుకే నేటి కాలంలో దుర్మార్గాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలో ఒక కుటుంబం నివసిస్తోంది. గత నెలలో ఈ కుటుంబం ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారం చోరీ చేశారు.

ఈ చోరీ తర్వాత బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే తెలిసినవాళ్లే ఈ దొంగతనానికి హాజరయ్యారు. కాకపోతే వాళ్లు బయటికి రాలేదు.” చోరీకి గురైన డబ్బు.. బంగారాన్ని తిరిగి రాబట్టడానికి బాధిత కుటుంబ సభ్యులు మంత్రాలు చేయడం. చేతబడి కి దిగారు. ఎలాగైనా సరే ఆ డబ్బు.. బంగారం వారికి తిరిగి వస్తుందని” చుట్టుపక్కల వారు అనడం మొదలుపెట్టారు. దీంతో ఆ దొంగలో భయం మొదలైంది.

చేతబడి వల్ల తన ప్రాణాలకు ముప్పు తప్పదని ఆ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి భావించాడు. అతనికి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణాలు పోతాయని భయం మొదలైంది. దీంతో అతడు 19 నగదు ఒక బ్యాగులో ప్యాక్ చేసి.. దొంగతనం చేసిన ఇంటి ఎదుట పెట్టాడు. అందులో ఒక లెటర్ రాశాడు..”మేము దొంగతనం చేసాం.దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారాన్ని దొంగిలించాం.నా వాటాగా 19 లక్షలు తీసుకున్నాను.అందుకే ఆ నగదు బ్యాగులో పెట్టి మీకు ఇస్తున్నాను. మిగిలిన సొమ్ము గురించి నాకు తెలియదు. నన్ను అడగవద్దు..” అని అతడు ఆ లేఖలో పెద్ద అక్షరాలతో రాశాడు. అయితే దొంగల కోసం ఆ ఇంటి యజమాని అంజనం వేయించాడని.. చేతబడి చేస్తున్నాడని చుట్టుపక్కల వారు ప్రచారం చేశారు. దీంతో ఆ దొంగ భయపడి డబ్బు తిరిగి ఇచ్చేసాడని తెలుస్తోంది. మరో దొంగ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధ పడినట్టు ప్రచారం జరుగుతోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird