ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త 700 సిరీస్‌ను తీసుకొస్తోంది. ఇందులో హానర్ 700, హానర్ 700 ప్రో, హానర్ 700 ఎస్ పేర్లతో మూడు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‌లో వెనుకవైపు కెమెరాల పక్కన ప్రత్యేకంగా మరో చిన్న డిస్ప్లేను అమర్చడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీన్ని AI ఫీచర్లతో పనిచేసే స్మార్ట్ బ్యాక్ స్క్రీన్‌గా కంపెనీ పరిచయం చేస్తోంది. ఈ ఫోన్ల కోసం చైనాలో ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. హానర్ సీఈఓ లీ జియాన్ ప్రకటించిన ప్రకారం నవంబర్ 23న చైనాలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ ఫోన్లను అధికారికంగా విడుదల చేయనున్నారు. వుహాన్ నగరంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
వెనుకవైపు 1.72 ఇక్కడ AI డిస్ప్లే
హానర్ 700 సిరీస్‌లోని మూడు మోడళ్లకు 1.72 AI డైనమిక్ బ్యాక్ స్క్రీన్ ఉండనుంది. ఇది ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్లోనే అమర్చిన చిన్న డిస్ప్లే. దీని సాయంతో వెనుక కెమెరాలతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు స్క్రీన్‌పై ప్రివ్యూ చూసుకోవచ్చు. అంతేకాదు, నోటిఫికేషన్లు, సమయం, ప్రత్యేక థీమ్‌లు, AI ఆధారిత ఇంటరాక్షన్ వంటి సౌకర్యాలు కూడా అందించబడతాయి. ఫోన్ వెనుక స్క్రీన్‌లో హార్ట్ రేట్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని చూస్తే PPG సెన్సార్ కూడా ఉండనుందని కంపెనీ చూపుతుంది. AI సాయంతో త్వరగా ఆరోగ్య సంబంధిత ప్రాథమిక వివరాలు తెలుసుకునే సదుపాయం అందించబడుతుంది. ఇది వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు.
9,000mAh బ్యాటరీ.. స్నాప్ డ్రాగన్ చిప్సెట్లు
ఈ సిరీస్‌లో మరో ప్రధాన ఆకర్షణ 9,000mAh Qinghai Lake బ్యాటరీ. మూడు మోడళ్లలోనూ ఈ భారీ బ్యాటరీని అందించారు. ఇంత పెద్ద బ్యాటరీ ఫోన్ మందం 7.96 మిల్లీమీటర్ల స్థాయిలో ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రదర్శించింది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రో మోడల్లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుందని లీకులు, ప్రీ-లాంచ్ సమాచారం చెబుతున్నాయి. పనితీరు కోసం మూడు ఫోన్లలోనూ క్వాల్కమ్ స్నాప్ డ్రా చిప్సెట్లను ఉపయోగించనున్నారు. అయితే ఒక్కో మోడల్లో ఏ చిప్‌సెట్‌నే పూర్తి వివరాలు, ధరలు లా ఉంటుందాచ్ ఈవెంట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
200MP కెమెరా.. 3.5x ఆప్టికల్ జూమ్
ఫొటోగ్రఫీ ఇష్టపడేవారిని ఆకట్టుకునేలా హానర్ ఈ సిరీస్‌లో కెమెరాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మూడు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండనుంది. అయితే హానర్ 700, హానర్ 700 ప్రో మోడళ్లలో అదనంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించనున్నారు. ఇది 3.5x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. దూరంలో ఉన్న వస్తువులను క్వాలిటీ తగ్గకుండా దగ్గరగా ఫోటోలు తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రెండు మోడళ్లకు ప్రత్యేక టెలిఫోటో ఎక్స్టెండర్ యాక్సెసరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సిరీస్‌లో తొలిసారిగా 4K సినిమాటిక్ లైఫ్ ఫోటో ఫీచర్‌ని తీసుకొస్తున్నారు. అంటే ఫొటో తీసే సమయంలో చిన్న వీడియోల కదలికలు, శబ్ద వివరాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వెనుక స్క్రీన్ సాయంతో ప్రధాన కెమెరాలతో సెల్ఫీలు తీసుకోవడం మరో ప్రత్యేకత.
నవంబర్ 23న ధరల ప్రకటన
హానర్ 700 సిరీస్ ఫోన్లు క్లియర్ స్కై, కోల్డ్ వైట్, పింక్ మిస్ట్, బ్లూ టోన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీ కోసం కంపెనీ రూపొందించిన మూడో తరం C3 RF చిప్‌ను కూడా ఈ ఫోన్లలో అందించబడుతుంది. MagicOS 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుందని కంపెనీ ప్రీ-లాంచ్ సమాచారం వెల్లడిస్తోంది. హానర్ 700S ఎంట్రీ లెవల్ మోడల్‌గా, హానర్ 700 సాధారణ విడుదల కోసం, హానర్ 700 ప్రో మరింత ప్రీమియం ఫీచర్లతో రానుంది. ప్రస్తుతం చైనాలో రిజర్వేషన్లు ప్రారంభమైనప్పటికీ ధరలు, పూర్తి విక్రయాల వివరాలు వెల్లడించలేదు. నవంబర్ 23న జరిగే లాంచ్ ఈవెంట్లో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
