
ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. పరువుపోతుందన్న భయంతో కన్నతండ్రే తన కుమార్తె ప్రాణాలు తీసిన విషాద ఘటన నార్నూర్ మండల పరిధిలోని ఉమ్రి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో కుటుంబం పరువు పోతుందన్న భయంతో తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కైలాస్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల పరువు పోతుందన్న కారణంతో తానే హత్య చేసినట్లు కైలాస్ విచారణలో అంగీకరించాడు.
ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కైలాస్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఘటనాస్థలంలో సాక్ష్యాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరిగింది.
[Honor killing, in Adilabad, murder case, Father Murder, Daughter, TeluguOne]
