Home సినిమా బంగారం నేడు తగ్గిందా.. పెరిగిందా? – iDreamPost – Andhra Waves

బంగారం నేడు తగ్గిందా.. పెరిగిందా? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
బంగారం నేడు తగ్గిందా.. పెరిగిందా? - iDreamPost


దేశంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొన్ని నెలల క్రిత వరకు ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన పసిడి ధర.. దసరా పండగ ముందు నుంచి కొన్ని రోజుల పాటు తగ్గింది. మధ్యలో కాస్త పెరిగినప్పటికీ.. నవంబర్ నెలారంభం నుంచి వరుసగా దిగి వస్తోంది. ఒకానొక సమయంలో బంగారం ధర రూ.1.50 వేలకు చేరగా.. ఇప్పుడు పడిపోతూ.. లక్షకు చేరువగా వస్తోంది. దీంతో జనాలు పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. జ్యూవెలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. మరి వరుసగా పడిపోతున్న బంగారం ధర నేడు ఎలా ఉంది.. తగ్గిందా.. పెరిగిందా అంటే..

పసిడి ప్రియులకు నేడు కూడా శుభవార్త అందింది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, ఈ వారం ప్రారంభమైన సోమవారం (నవంబర్ 23) నాడు కూడా స్వల్పంగా తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం కిందకు దిగిరావడంతో కొనుగోలుదారులకు భారీగా ఊరట లభించినట్లయింది.

ధరల పతనానికి ప్రధాన కారణాలివే..

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ బలపడటం బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనికి తోడు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే సంకేతాలు మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. డిసెంబర్‌లో జరగనున్న ఫెడ్ సమీక్షా వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటే, పసిడి మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

నవంబర్ 23న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ నమోదయ్యాయి:

నగరం 24 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారం

హైదరాబాద్ రూ. 1,25,070 రూ. 1,14,640

విజయవాడ రూ. 1,25,070 రూ. 1,14,640

విశాఖపట్నం రూ. 1,25,070 రూ. 1,14,640

ఢిల్లీ రూ. 1,25,220 రూ. 1,14,790

వెండి ధరల తీరు ఇలా ఉంది

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఆదివారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1,75,000 వద్ద ఉండగా, సోమవారం నాటికి రూ. 100 తగ్గింది రూ. 1,74,900 వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,75,000 వద్ద ట్రేడవుతోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird